
మొండి పట్టుదలకు, కఠిన క్రమశిక్షణకు మారుపేరైన శనీశ్వరుడితో ఈ నెల (జూలై) 7, 8, 9 తేదీల్లో చంద్రుడు మీన రాశిలో యుతి చెందడం జరుగుతోంది. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి, కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇవి మంచి రోజులు. ఈ శని, చంద్రుల మీద గురువు దృష్టి కూడా పడడం వల్ల ఏ పని చేపట్టినా అనుకున్నది అనుకున్నట్టు పూర్తవుతుంది. ఆదాయం, ఉద్యోగం, పెళ్లి, బదిలీ, పోటీ పరీక్షలు, కోర్టు కేసులు, వివాదాల్లో విజ యాలు సాధించడానికి అవకాశం ఉంది. వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశులవారు సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో శని, చంద్రుల యుతి వల్ల కొద్ది ప్రయత్నంతో మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించిన ఆశిం చిన ఉద్యోగం పొందుతారు. రకరకాలు ప్రయోగాలు, ప్రయత్నాలతో వృత్తి, వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కిస్తారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించుకుంటారు.. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో శని, చంద్రుల కలయిక వల్ల విదేశాల్లో ఉద్యోగాలకు ప్రయత్నించేందుకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో పదోన్నతికి ప్రయత్నించడం మంచిది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లో సరైన ప్రయత్నాలు, నిర్ణయాలతో ఆశించిన లాభాలు పొందుతారు. మంచి పరిచయాలు కలుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కర్కాటకం: ఈ రాశికి భాగ్యస్థానంలో రాశ్యధిపతి చంద్రుడు శనీశ్వరుడిని కలవడం వల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాలు అంచనాలకు మించిన ఫలితాలనిస్తాయి. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి