
మెదక్ ఫాల్కన్స్‌తో మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్ స్టార్ కొడిమెల హిమతేజ శతక్కొట్టాడు. కేవలం 55 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కాగా తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌లో భాగంగా సోమవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్- మెదక్ ఫాల్కన్స్ ముఖాముఖి తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన ఖమ్మం తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో వాఫీ కచ్చి 14 పరుగులు చేయగా.. జీఎస్‌కే రెడ్డి డకౌట్ అయ్యాడు. ఇలాంటి తరుణంలో వన్‌డౌన్ బ్యాటర్ కొడిమెల హిమతేజ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. మొత్తంగా 57 బంతులు ఎదుర్కొన్న హిమతేజ 11 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలిన వారిలో మికిల్ జైస్వాల్ 15 పరుగులు చేయగా.. ప్రతీక్ రెడ్డి 32 పరుగులతో రాణించాడు. ఆఖర్లో కెప్టెన్ సీవీ మిలింద్ 14 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఖమ్మం ఏసెస్ 190 పరుగులు చేసింది. మెదక్ బౌలర్లలో రవితేజ రెండు, మధుకర్ మన్నె, అర్జున్ గొర్రపల్లి తలా ఒక వికెట్ పడగొట్టారు. తిరుపతిలో ఘనంగా 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున కుటుంబం (ఫొటోలు) మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు) ఎన్టీఆర్ బావమరిది కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ (ఫొటోలు) బీచ్ షాక్స్ పై గళం ఎత్తిన YSRCP మహిళా నేతలు రవి బిష్ణోయ్ ఔట్? సంజు ఇన్? మూడో టీ20 ఆడే భారత జట్టు ఇదే! ప్రశ్న రావణ్ పై ఉపా చట్టం... CPI నారాయణ అదిరిపోయే కౌంటర్