శ్రేయస్ ను నిందించడం ఆపండి.. అదే అసలు సమస్య
Actor ProfileActor

శ్రేయస్ ను నిందించడం ఆపండి.. అదే అసలు సమస్య

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శ్రేయస్ ను నిందించడం ఆపండి.. అదే అసలు సమస్య
Sakshi20 Oct 2026
శ్రేయస్ ను నిందించడం ఆపండి.. అదే అసలు సమస్య

ఐర్లాండ్ గ‌డ్డ‌పై సిరీస్ ఓటమితో ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న టీమిండియా ఇంగ్లండ్ గ‌డ్డ‌పై అదే దారుణ ఆట‌తీరును ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తోంది. తొలి టీ20 వ‌ర్షార్ప‌ణం కాగా, ఆ త‌ర్వాత జరిగిన మూడు టీ20ల్లోనూ ప‌రాజ‌యం చ‌విచూసిన టీమిండియా 0-3తో ఇంగ్లండ్‌కు సిరీస్‌ను కోల్పోయింది. క‌నీసం చివ‌రి టీ20లోనైనా విజ‌యం సాధించి గౌర‌వ‌ప్ర‌దంగా సిరీస్‌ను ముగించాల‌ని టీమిండియా భావిస్తోంది. ఇక కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు ఏదీ క‌లిసిరావ‌డం లేదు. బ్యాట‌ర్‌గా రాణిస్తున్న‌ప్ప‌టికీ కెప్టెన్‌గా వ‌రుస ఓట‌ములు అత‌డిని ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. అత‌డి కెప్టెన్సీలో టీమిండియా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట ఓట‌మి (ఒక మ్యాచ్ ర‌ద్దు) పాల‌య్యింది. దీంతో శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్‌గా టీ20ల్లో ఇప్ప‌టిదాకా గెలుపు రుచి చూడలేదు. అటు టీమిండియా కూడా ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన త‌ర్వాత ఒక్క టీ20 మ్యాచ్ కూడా గెల‌వ‌క‌పోవడం గ‌మ‌నార్హం. దీంతో అయ్య‌ర్ కెప్టెన్సీపై అప్పుడే నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. ఈసారి అయ్య‌ర్‌తో పాటు కోచ్ గంభీర్‌పై కూడా క‌త్తి వేలాడుతోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అదీగాక జింబాబ్వే టూర్‌తో పాటు ఆసియా గేమ్స్‌కు హెడ్‌కోచ్ గంభీర్‌కు విశ్రాంతినిచ్చి అత‌డి స్థానంలో మాజీ క్రికెట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌ను టీమిండియా వెంట పంపించాల‌ని బీసీసీఐ చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో టీమిండియా అసిస్టెంట్ కోచ్ రెయాన్ టెన్‌డెస్క‌టే శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్సీ భ‌వితవ్యంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. బ్రిస్ట‌ల్ వేదిక‌గా నాలుగో టీ20లో టీమిండియా ఓట‌మి పాలైన త‌ర్వాత ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో టెన్ డ‌స్క‌టే మాట్లాడాడు. 'టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ ఇప్పుడే బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. అత‌డి కెప్టెన్సీలో టీమిండియాకు వెంట‌నే విజ‌యాలు రావాలంటే ఎలా? కాస్త ఓపిక ప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంటుంది. మ్యాచ్ ఓట‌ముల‌కు శ్రేయ‌స్‌ను నిందించ‌డం ఆపండి. అత‌డు కెప్టెన్‌గా నిలుదొక్కుకోవ‌డానికి కాస్త స‌మ‌యం ప‌డుతుంది. ఇప్పుడు వ‌చ్చే ఓటములే త‌ర్వాత గెలుపుకు బాట‌లు వేస్తాయి. నిజానికి శ్రేయ‌స్