
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Man dog costume in Khandwa collectorate Madhya Pradesh: సాధారణంగా చాలా మంది ప్రభుత్వాలు సరిగ్గా ప్రజలకు కావాల్సిన సదుపాయలు, ఇచ్చిన హమీలు నెరవేర్చకుంటే నిరసనలు చేస్తారు. కొంత మంది ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకునేందుకు వినూత్నంగా నిరసనలు చేస్తారు. దీనితో ఓవర్ నైట్ లో ఫెమస్ అయి ఉన్నతాధికారుల వరకు వీరి బాధలు చేరుతాయని భావిస్తారు. ఈ నేపథ్యంలో మధ్య ప్రదేశ్ లోని ఖాండ్వాలో ఒక వ్యక్తి తమ గ్రామంలో కొన్ని రోజులుగా ఉన్న కుక్కల బెడదను లేకుండా చేయాలని అధికారుల చుట్టు తిరిగాడు. కానీ లాభం లేకుండా పోయింది. దీంతో వెరైటీ నిరసలు చేయాలని ప్లాన్ చేశాడు. దీనిలో భాగంగా ఖాండ్వాలోని కలెక్టర్ ఆఫీసు లో మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపక్ష నాయకుడు దీపక్ రాథోర్ వెరైటీగా కుక్క మాదిరిగా కాస్ట్యూమ్ ను వేసుకున్నాడు. నేరుగా కలెక్టర్ కు శునకంలా వేషం వేసుకుని మరీ వెళ్లి గత నాలుగేళ్లలో కుక్కల సంతాన నిరోధక కార్యక్రమాలపై రూ. 40 లక్షలు ఖర్చు చేయగా, 13, 225 కుక్కకాటు కేసులు నమోదయ్యాయని ఆరోపించారు. ఈ కార్యక్రమం యొక్క ఖర్చు, అమలుపై విచారణ జరపాలని ఆయన కలెక్టరేట్ ఆఫీస్ లో తమ గొడును చెప్పుకున్నారు. నగరంలో ఇంత ఖర్చుచేసిన కూడా వీధి శునకాల కాటులతో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొచ్చాడు. ఇటీవల కుక్క కాటు ఘటనలు మరీ ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. Read more: Snake Video: ఏంటాలెంట్ భయ్యా.!. పాము బర్త్ డే సెలబ్రేషన్స్ ఇలా కూడా చేస్తారా..?.. వీడియో వైరల్