
IND vs SL : ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27లో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య శనివారం (ఆగస్టు 15) నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో విజయం సాధించిన జట్టుకు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకునేందుకు అవకాశాలు మెరుగుపడతాయి. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌లో విజయం సాధించాలని అటు శ్రీలంక, ఇటు భారత్ పట్టుదలగా ఉన్నాయి. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత భారత జట్టు టెస్టుల్లో ఘోర పరాజయాలను చవిచూసింది. ఈ క్రమంలోనే లంకతో సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. సుదీర్ఘ ఫార్మాట్‌కు సీనియర్లు వీడ్కోలు చెప్పడంతో ఎక్కువగా కుర్రాళ్లు జట్టులో ఉన్నారు. చాలా మంది కుర్రాళ్లకు లంకలో పర్యటించడం ఇదే తొలిసారి కావడంతో ఎలా రాణిస్తారు అన్న ఆసక్తికరంగా మారింది. జియో హాట్‌స్టార్‌లో రాదు.. ఈ సిరీస్‌కు సంబంధించిన అధికార బ్రాడ్‌కాస్టర్ హక్కులు సోని నెట్‌వర్క్ వద్ద ఉన్నాయి. దీంతో జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లలో మ్యాచ్‌లు రావు. టీవీల్లో ఈ మ్యాచ్‌లను సోని స్పోర్ట్స్ ఛానల్‌లో ప్రత్యక్షప్రసారం కానున్నాయి. ఇక ఓటీటీ విషయానికి వస్తే.. సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే.. ఈ వేదికల్లో మ్యాచ్‌లను ఫ్రీగా చూసే అవకాశం లేదు. IND vs AFG : టీ20 సిరీస్ షెడ్యూల్ మార్చండి.. వినాయక చవితి రోజు మ్యాచ్ ఆడదాం.. బీసీసీఐకి అఫ్గాన్ రిక్వెస్ట్ ఫ్రీగా ఎలా చూడొచ్చంటే ? DD ఫ్రీ డిష్ ఉంటే.. భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్ DD స్పోర్ట్స్‌లో వీక్షించవచ్చు. ఎలాంటి రుసుములు ఉండవు. #TeamIndia is all set to play 2-match Test Series against Sri Lanka in Galle and Colombo. Watch all the LIVE action on DD Sports (DD Free Dish)!#SLvIND #TeamIndia@ICC @BCCI — Doordarshan Sports (@ddsportschannel) August