శాతం వృద్ధి.. 2025
Actor ProfilePolitician

శాతం వృద్ధి.. 2025

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శాతం వృద్ధి.. 2025-26 రెండో త్రైమాసికంలో నమోదు
Andhra Jyothy6 Dec 2026
శాతం వృద్ధి.. 2025-26 రెండో త్రైమాసికంలో నమోదు

రెండేళ్ల జాతీయ సగటు కంటే మనదే ఎక్కువ ప్రాజెక్టుల పెట్టుబడుల్లో 75 శాతం, ఎంఎ్‌సఎంఈల్లో 73 శాతం వృద్ధి ప్రణాళిక శాఖ జూలై ఆర్థిక నివేదికలో వెల్లడి ప్రజలపై ధరల భారం లేకుండా చూడండి ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వండి అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటోంది. సవాళ్లను ఎదుర్కొంటూ వృద్ధి రేటులో దూసుకెళ్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర ప్రణాళిక విభాగం మంగళవారం అందజేసిన 2026 జూలై ఆర్థిక నివేదికలో అది స్పష్టమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 10.7 శాతం వృద్ధిరేటు నమోదైనట్లు ఆ నివేదిక వెల్లడించింది. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ప్రతీ ప్రభుత్వ శాఖలో లక్ష్యాలను చేరుకునేలా వనరుల నిర్వహణ చేపట్టాలన్నారు. ప్రజలపై ధరల భారం పడకుండా అధ్యయనానికి ఓ కమిటీ వేయాలని ఆదేశించారు. ఎల్‌నినో సంక్షోభం నేపథ్యంలో నీటి లభ్యత, ఉత్పత్తుల విలువ జోడింపుపై ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. జిల్లా, నియోజకవర్గం, మండలాలవారీ ప్రణాళికల ద్వారా లక్ష్యసాధన సులువవుతుందని చెప్పారు. రెండేళ్ల నుంచి జాతీయ సగటు వృద్ధిరేటు కంటే ఏపీలో ఎక్కువ వృద్ధిరేటు నమోదవుతోందని ప్రణాళిక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వృద్ధిరేటు పెరిగినప్పటికీ కీలక విభాగాల్లో మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల్లో 10.7 శాతం వృద్ధిరేటు నమోదైంది. అంతకుముందు ఏడాది రెండోత్రైమాసికంలో నమోదైన 7 శాతం కంటే ఇది చాలా ఎక్కువ. 2023-24లో మందగమనంలో ఉన్న వ్యవసాయరంగం ఇప్పుడు రెండంకెల వృద్ధి సాధిస్తోంది. 2025-26 తొలి క్వార్టర్‌లో ఈరంగంలో 9.4 శాతం వృద్ధి నమోదు కాగా రెండో క్వార్టర్‌లో 13.5 శాతానికి చేరింది. పారిశ్రామిక రంగంలో అంతకుముందు ఏడాది 5.1 శాతం వృద్ధి నమోదవ్వగా, 2025-26లో రెండింతలు పెరిగి 10.6 శాతానికి చేరుకుంది. సేవారంగం వృద్ధి మొదటి త్రైమాసికంలో 8.5 శాతం నుంచి రెండో