
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Venus Transit In Chitra Nakshatra Effect: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడిని అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తూ ఉంటారు. ఈ గ్రహం సంపదతో పాటు ప్రేమ వైభవం విలాసం సౌందర్యానికి కారకుడిగా కూడా భావిస్తారు. ఇదిలా ఉంటే ఆగస్టు 25వ తేదీన 12 గంటల సమయంలో శుక్రుడు నక్షత్ర సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహం సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఒకటే నక్షత్రంలో సంచార దశలో ఉండబోతోంది. ముఖ్యంగా చిత్రా నక్షత్రంలోకి శుద్రుడు ప్రవేశించడం కారణంగా మొత్తం నాలుగు రాశుల వారిపై ఊహించని ప్రభావం పడబోతోంది. ఈ సమయంలో విపరీతమైన ఆధార మార్గాలు పెరగడమే కాకుండా కొన్ని రాశుల వారికి ఉద్యోగాలపరంగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో పురోగతి కూడా లభిస్తుంది. శుక్రుడి సంచారం కారణంగా ఏయే నాలుగు రాశుల వారికి సమయం అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. మేషరాశి చిత్రా నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించిన వెంటనే మేషరాశి వారికి ఎంతో మేలు జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగస్తులు కార్యాలయాల్లో మంచి మంచి పనులు చేయగలుగుతారు. కొత్త ప్రాజెక్టుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ వనరులు కూడా అంచలంచలుగా పెరుగుతాయి. అంతేకాకుండా డబ్బుకు ఎలాంటి కొరత ఉండదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వృషభ రాశి వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. అంతేకాకుండా శుక్రుడు సంచార ప్రభావం కొత్త ప్రణాళికలను కూడా