వసంత కోకిల’ క్లైమాక్స్ స్ఫూర్తితో పుట్టిన సింహాద్రి’.. బాలకృష్ణ రిజెక్ట్ చేసిన కథతో ఎన్టీఆర్ ఇండస్ట్రీ రికార్డ్
Actor ProfileActor

వసంత కోకిల’ క్లైమాక్స్ స్ఫూర్తితో పుట్టిన సింహాద్రి’.. బాలకృష్ణ రిజెక్ట్ చేసిన కథతో ఎన్టీఆర్ ఇండస్ట్రీ రికార్డ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వసంత కోకిల’ క్లైమాక్స్ స్ఫూర్తితో పుట్టిన సింహాద్రి’.. బాలకృష్ణ రిజెక్ట్ చేసిన కథతో ఎన్టీఆర్ ఇండస్ట్రీ రికార్డ్
Samayam Telugu14 Oct 2026
వసంత కోకిల’ క్లైమాక్స్ స్ఫూర్తితో పుట్టిన సింహాద్రి’.. బాలకృష్ణ రిజెక్ట్ చేసిన కథతో ఎన్టీఆర్ ఇండస్ట్రీ రికార్డ్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'సింహాద్రి'. 'స్టూడెంట్ నెం.1' తర్వాత వీరిద్దరి కలయికలో రూపొందిన రెండో చిత్రమిది. 2003 జులై 9న విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను సృష్టించింది. కేవలం 19 ఏళ్ల నూనూగు మీసాల వయసులోనే తారక్ ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు. నేటితో 'సింహాద్రి' 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా విశేషాలు...'సింహాద్రి' సినిమాలో ఎన్టీఆర్ సరసన భూమిక చావ్లా, అంకిత హీరోయిన్లుగా నటించారు. నాజర్, ముఖేష్ రుషి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, భానుచందర్, వేణుమాధవ్, శరత్ సక్సేనా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథ అందించగా.. విశ్వనాథ్, ఎం.రత్నం డైలాగ్స్ రాశారు. ఎం.ఎం కీరవాణి సంగీతం సమకూర్చగా, రవీంద్రబాబు సినిమాటోగ్రఫీ నిర్వహించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చేశారు. VMC ప్రొడక్షన్స్ బ్యానర్ పై దొరస్వామి రాజు, విజయ్ కుమార్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'వసంత కోకిల' సినిమా క్లైమాక్స్ లో హీరో కమల్ హాసన్ ను హీరోయిన్ శ్రీదేవి వదిలి వెళ్లిపోయే సన్నివేశం 'సింహాద్రి' కథకు బీజం పడటానికి కారణమైందని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ గతంలో పలు సందర్భాల్లో చెప్పారు. ఆ సినిమా చూస్తున్నప్పుడు "హీరోని హీరోయిన్ వదిలి వెళ్ళిపోతూంటే, గుండెల్లో గునపంతో పొడిచేసినట్టు ఉంది" అని తన అసిస్టెంట్ అనడంతో.. ఆ మాట పట్టుకుని ''హీరోని అమితంగా ప్రేమిస్తున్న హీరోయినే.. అతడి గుండెల్లో గునపంతో పొడిస్తే ఎలా ఉంటుంది?, దానికి దారితీసే పరిస్థితులు ఏంటి?'' అనే ఐడియాతో సింహాద్రి స్టోరీ రాసుకున్నారు విజయేంద్రప్రసాద్. 'సింహాద్రి' కథని ముందుగా నందమూరి బాలకృష్ణకి వినిపించారు. ఆయన హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో సినిమాగా తీద్దామని భావించారు. కానీ దర్శక హీరోలు వేరే కథను ఎంచుకోవడంతో, చివరకు వి. దొరైస్వామి రాజా నిర్మాతగా విజయేంద్రప్రసాద్ కథతో సినిమా