వరంగల్ కాంగ్రెస్ లో మళ్లీ లొల్లి.. తగ్గేదేలే అంటున్న కొండా సురేఖ.. ఎమ్మెల్యే కడియం తీరు
Actor ProfilePolitician

వరంగల్ కాంగ్రెస్ లో మళ్లీ లొల్లి.. తగ్గేదేలే అంటున్న కొండా సురేఖ.. ఎమ్మెల్యే కడియం తీరు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వరంగల్ కాంగ్రెస్ లో మళ్లీ లొల్లి.. తగ్గేదేలే అంటున్న కొండా సురేఖ.. ఎమ్మెల్యే కడియం తీరుపై హైకమాండ్ కు
10TV Telugu3 Oct 2026
వరంగల్ కాంగ్రెస్ లో మళ్లీ లొల్లి.. తగ్గేదేలే అంటున్న కొండా సురేఖ.. ఎమ్మెల్యే కడియం తీరుపై హైకమాండ్ కు

కడియంపై కొండా సురేఖ ఫిర్యాదు వరంగల్ కాంగ్రెస్‌లో పెరిగిన వివాదం అధికారుల రివ్యూతో రేగిన లొల్లి Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ నేతలు, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న పరిస్థితులు, ఇటీవలే అధిష్టానం చొరవతో సర్దుమణిగాయని అందరూ భావించారు. అయితే, నియోజకవర్గాల్లో పెత్తనం, జిల్లా అభివృద్ధి సమీక్షల విషయంలో ఇద్దరి మధ్య అంతర్గతంగా ఉన్న అసంతృప్తి కాస్తా, తాజాగా కడియం శ్రీహరి చేసిన ఒక అధికారిక సమీక్షా సమావేశంతో ఒక్కసారిగా బహిర్గతమైంది. TGPSC Notification: TGPSC నుంచి రెండు నోటిఫికేషన్లు.. రూ.1.37 లక్షల శాలరీ ప్యాకేజీ.. నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ తాజాగా కడియం శ్రీహరి నియోజకవర్గ(Warangal Congress) సమస్యలపై అధికారులతో ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించడమే. ఈ సమావేశం అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన పూర్తి మాస్టర్ ప్లాన్‌ను తమకు సమర్పించాలని ఆయన అధికారులను కోరారు. ఈ పరిణామంపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha)తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిని దాటి, యావత్ జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకోవడం ఏంటని, ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ అధికారులపై ఒత్తిడి తేవడం సరికాదని ఆమె మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని మంత్రి కొండా సురేఖ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. కడియం శ్రీహరి వ్యవహార శైలిపై, జిల్లా రాజకీయాల్లో ఆయన తలదూర్చుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏఐసీసీ పెద్దలతో పాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఆమె ఘాటైన లేఖలు రాశారు. గతంలోనూ వీరిద్దరు ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకోగా, తాజాగా కొండా సురేఖ రాసిన ఈ లేఖలతో వరంగల్ కాంగ్రెస్ రాజకీయం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది