వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ లో మార్పు.. గాంధీ జయంతి రోజున ఘనంగా ప్రారంభమయ్యేలా
Actor ProfileCelebrity

వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ లో మార్పు.. గాంధీ జయంతి రోజున ఘనంగా ప్రారంభమయ్యేలా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ లో మార్పు.. గాంధీ జయంతి రోజున ఘనంగా ప్రారంభమయ్యేలా
Zee Telugu28 Dec 2026
వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ లో మార్పు.. గాంధీ జయంతి రోజున ఘనంగా ప్రారంభమయ్యేలా

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. 2027 ODI World Cup Schedule: 2027 వన్డే ప్రపంచకప్ కేవలం ఫోర్లు, సిక్సర్లతో అలరించే సాధారణ క్రికెట్ పోరాటమే కాకుండా.. చరిత్ర, గౌరవం, ఒక సరికొత్త ఫార్మాట్‌తో అభిమానుల ముందుకు అద్భుతంగా రాబోతోంది. క్రీడలు, చరిత్ర కలగలిసిన ఈ మహాసంగ్రామం ఏకంగా అక్టోబర్ 2న, అనగా మహాత్మా గాంధీ జయంతి రోజున ప్రారంభం కానుంది. మహాత్మా గాంధీ 158వ జయంతి సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులతో పాటు చరిత్ర ప్రేమికులకు ఎంతో గర్వకారణంగా, ప్రత్యేకంగా నిలుస్తోంది. గాంధీజీ జీవితం భారతదేశంతో పాటు ఈ ప్రపంచకప్‌కు ప్రధాన ఆతిథ్యమిస్తున్న దక్షిణాఫ్రికా దేశపు భవిష్యత్తును మార్చడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది. ఒక సాధారణ యువ బారిస్టర్‌గా దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన గాంధీజీ, అక్కడ తీవ్రమైన వర్ణవివక్షను ఎదుర్కొన్నారు. ఆ పోరాటంలోనే ఆయనలోని సత్యాగ్రహి ఆవిర్భవించారు. దక్షిణాఫ్రికాలో గడిపిన ఆ రెండు దశాబ్దాల కాలమే తన జీవితంలో అత్యంత కీలకమైనదని ఆయన తరచూ భావించేవారు. అక్కడ భారతీయుల హక్కుల కోసం ఆయన నడిపిన అహింసాయుత పోరాటం, తర్వాతి కాలంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నాయకులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత భారత్‌లో జాతిపితగా స్వాతంత్ర్య సంగ్రామానికి ఆయన సారథ్యం వహించారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీని అక్టోబర్ 2న ప్రారంభించడమే బాపూజీకి అర్పించే ఘనమైన నివాళిగా భావిస్తున్నారు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. మొదట ఈ టోర్నీని