వాహనదారులకు బిగ్ రిలీఫ్..పెట్రోల్ బంకుల్లో పాత వాహనాల కోసం మళ్లీ 10 పెట్రోల్ అందుబాటులో
Actor ProfilePolitician

వాహనదారులకు బిగ్ రిలీఫ్..పెట్రోల్ బంకుల్లో పాత వాహనాల కోసం మళ్లీ 10 పెట్రోల్ అందుబాటులో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వాహనదారులకు బిగ్ రిలీఫ్..పెట్రోల్ బంకుల్లో పాత వాహనాల కోసం మళ్లీ 10 పెట్రోల్ అందుబాటులో
Zee Telugu20 Jan 2027
వాహనదారులకు బిగ్ రిలీఫ్..పెట్రోల్ బంకుల్లో పాత వాహనాల కోసం మళ్లీ 10 పెట్రోల్ అందుబాటులో

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. E10 Petrol Brings Back: దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో ఇథనాల్ కలపడంపై వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక పునరాలోచనలో పడింది. వాహనాల మైలేజ్, ఇంజిన్ ఆయుష్షు తగ్గిపోతున్నాయంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో, పాత వాహనాల కోసం ప్రత్యేకంగా E10 పెట్రోల్ (10 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనం)ను మళ్లీ బంకుల్లో అందుబాటులోకి తీసుకురావాలని భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) అనంత నాగేశ్వరన్ ప్రతిపాదించారు. కొత్త వాహనాలకు మాత్రం E20ని యథావిధిగా కొనసాగించాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం దేశంలో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ చేసిన E20 పెట్రోల్ అమల్లో ఉంది. అయితే పాత ఇంజిన్లు ఉన్న మోటార్ సైకిళ్లు, కార్ల యజమానులు దీనివల్ల నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో E10ని పునరుద్ధరిస్తే ధరలు ఏ విధంగా ఉంటాయనే దానిపై మార్కెట్లో చర్చ నడుస్తోంది. ధరల అంచనా.. ప్రస్తుత ట్యాక్స్‌లు, పెట్రోల్, ఇథనాల్ బేస్ ధరల ఆధారంగా చూస్తే.. E20తో పోలిస్తే E10లో పెట్రోల్ శాతం (90%) కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దీంతో దీని లీటరు ధర సుమారు రూ.103 నుంచి రూ.105 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో మార్పులు ఉండవచ్చు. ఇథనాల్ కలపని ప్రీమియం ఇంధనాలు.. మరోవైపు ఎలాంటి ఇథనాల్ కలపని స్వచ్ఛమైన E0 ప్రీమియం పెట్రోల్ (100 ఆక్టేన్) కూడా కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో అందుబాటులో ఉంది. ఇండియన్ ఆయిల్ (XP100)