విహంగాల నేస్తమా.. పెనవేసుకున్న బంధమా
Actor ProfilePolitician

విహంగాల నేస్తమా.. పెనవేసుకున్న బంధమా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విహంగాల నేస్తమా.. పెనవేసుకున్న బంధమా
Eenadu1 Jan 2027
విహంగాల నేస్తమా.. పెనవేసుకున్న బంధమా

ముగిసిన విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్థానం ఈనాడు, విశాఖపట్నం సాగరతీర నగరంలో విహంగాల నేస్తాన్ని.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన సైనిక విమానాలకు ఆశ్రయమిచ్చిన చిన్న ఎయిర్‌ స్ట్రిప్‌ను. తర్వాత లక్షల మంది ప్రయాణికులను దేశ, విదేశాలకు చేరవేసే విమానాశ్రయంగా ఎదిగా. దశాబ్దాల నా ప్రస్థానంలో ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి.. వాటన్నింటిని గుండెల్లో పదిల పర్చుకున్నా.. విశాఖ ఎదగడంలో నావంతు: ‘రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నన్ను అత్యవసరంగా బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్మించింది. రాయల్‌ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానాలు నా ప్రాంగణంలో నుంచే శత్రువులపైకి దూసుకెళ్లేవి. 1954లో మొదటి వాణిజ్య విమానం ల్యాండ్‌ అయ్యింది. అప్పట్లో వారానికి ఒకే ఒక్క విమానం నడిచేది. నాటి నుంచి విశాఖ పారిశ్రామికంగా ఎదగడానికి ఎంతో తోడ్పాటు ఇచ్చా. 1981 నాటికి ప్రొఫెషనల్‌ పైలట్ల శిక్షణ కార్యక్రమాలకు వేదికగా, పౌర విమానయాన సేవలకు నాంది పలికా.’ ప్రయాణంలో ఎన్నో మార్పులు: ‘1986లో భారత నౌకాదళం ‘ఐఎన్‌ఎస్‌ డేగ’ పేరుపెట్టి నా బాధ్యతలను తీసుకుంది. 2007లో పదివేల అడుగుల రన్‌ వేను సమకూర్చుకుని బోయింగ్‌ 737, ఎయిర్‌బస్‌ ఏ320 వంటి భారీ విమానాలకు సునాయాసంగా ఆశ్రయం కల్పించా. 2012లో రాత్రి పూట ల్యాండింగ్‌ సిస్టమ్‌ (ఐఎల్‌ఎస్‌) సదుపాయం తీసుకొచ్చా. చీకట్లో కూడా విహంగాలు నా ఒడిలో సురక్షితంగా వాలుతుంటే ఆనందానికి అవధుల్లేవు.’ ‘కాలక్రమంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. చిన్న భవనం సరిపోక 2009లో అత్యాధునిక సదుపాయాలతో కొత్త ప్యాసింజర్‌ టెర్మినల్‌ భవనాన్ని ఏర్పాటు చేసుకున్నా. విశాలమైన లాంజ్‌లు, ఎస్కలేటర్లు, డ్యూటీఫ్రీ షాపులతో సరికొత్తగా ముస్తాబయ్యా. తొలిసారిగా సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభమైన రోజు నా ఆనందం అంతా ఇంతా కాదు. తర్వాత దుబాయ్, మలేసియా వంటి నగరాలకు విహంగాలు దూసుకెళ్లాయి.’ గర్వంగా ఉంది..: ‘భవిష్యత్తు అవసరాల కోసం భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమైంది. 16వ తేదీతో పూర్తిగా నా నుంచి పౌర