విశ్వనాథ్ సన్స్’ సినిమాకి నిజమైన హీరోలు ప్రేక్షకులే
Actor ProfileActor

విశ్వనాథ్ సన్స్’ సినిమాకి నిజమైన హీరోలు ప్రేక్షకులే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విశ్వనాథ్ సన్స్’ సినిమాకి నిజమైన హీరోలు ప్రేక్షకులే
Telugu Times28 Dec 2026
విశ్వనాథ్ సన్స్’ సినిమాకి నిజమైన హీరోలు ప్రేక్షకులే

‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాపై ప్రేమను కురిపిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు: కథానాయకుడు సూర్య తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. ప్రతిభ గల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించారు. రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ఆగస్టు 14, 2026న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రధాన తారాగణం అద్భుతమైన నటన, వెంకీ అట్లూరి రచనలోని బలం, సాంకేతిక నిపుణుల పనితీరు.. ఇలా అన్ని అంశాలు చక్కగా కుదిరి ‘విశ్వనాథ్ & సన్స్’ను గొప్ప చిత్రంగా మలిచాయి. అందుకే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తూ, వసూళ్ళ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం, హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకోవడంతో పాటు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొనడం విశేషం. ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ కథ విన్నప్పటి నుంచే, ఈ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైంది. ఇలాంటి సమయంలో ఒక కుటుంబ కథా చిత్రం చేసి, దానిని విజయవంతం చేసినందుకు చిత్ర బృందం మొత్తానికి అభినందనలు. నేను సూర్య గారితో ఒక సినిమా చేయాలి. ఆయనకు నచ్చే కథ ఇంకా చెప్పలేకపోయాను(నవ్వుతూ). త్వరలోనే మేమిద్దరం కలిసి పని చేస్తామని నమ్ముతున్నాను. నా సతీమణి