విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు
Actor ProfileActor

విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు
123Telugu17 Dec 2026
విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు

తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాడు. అయితే, విడుదలకు ముందు తమిళనాడులో ఈ చిత్రానికి ఎదురవుతున్న క్లిష్ట పరిస్థితి నిజంగానే షాకింగ్‌గా మారింది. తమిళనాట ప్రధాన థియేటర్లు/స్క్రీన్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయలేకపోతున్నట్లు ఆయా థియేటర్ల యాజామాన్యాలు వెల్లడించాయి. దీనికి కాంట్రాక్ట్ నిబంధనలు, షేర్ పర్సంటేజ్‌లు లేదా రెంట్ అగ్రిమెంట్లకు సంబంధించి ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య అవగాహన కుదరకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకు బిజినెస్ స్టేక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, అందువల్ల ఓపెనింగ్స్ రోజుల్లో గరిష్ట స్థాయిలో థియేటర్లు లభించకపోతే అది కలెక్షన్లపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, మొదటి రోజు టాక్ పాజిటివ్‌గా వస్తే మాత్రం, డిమాండ్‌ను బట్టి వెంటనే ఈ థియేటర్ల సమస్యలు సర్దుముణిగి, మరిన్ని ప్రధాన స్క్రీన్‌లను యాడ్ చేసే అవకాశం ఉంది. చూద్దాం మరి విడుదల సమయానికి ఈ టర్మ్స్ వివాదం ఎలా సర్దుమణుగుతుందో