
విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగువాడే అయినా తమిళ్ లో స్టార్ హీరోగా కొనసాగుతూ వస్తున్నాడు. విశాల్ (Vishal) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగువాడే అయినా తమిళ్ లో స్టార్ హీరోగా కొనసాగుతూ వస్తున్నాడు. పందెంకోడి,పొగరు, అభిమన్యుడు, డిటెక్టివ్ లాంటి సినిమాలతో విశాల్ భారీ విజయాలను అందుకొని తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస డిజాస్టర్లతో కొంతకాలం వెనకబడిన విశాల్, మూడేళ్ల క్రితం వచ్చిన మార్క్ ఆంటోనీ చిత్రంతో వంద కోట్ల మార్కును అందుకుని ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఈ సినిమాతో ఆయనపై ప్రేక్షకుల్లోపోయిన నమ్మకాన్ని మళ్లీ తెచ్చుకున్నాడు అని అనుకున్నారు. కానీ, విశాల్ రోజురోజుకి పతనమైపోతున్నాడని తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. మార్క్ ఆంటోనీతో వందకోట్ల క్లబ్ లో చేరిన విశాల్.. చేజేతులరా తన కెరీర్ ని నాశనం చేసుకుంటున్నాడు అని చెప్పుకొస్తున్నారు. తాజాగా ఆయన నటించి, దర్శకత్వం వహించిన మకుటం చిత్రం విశాల్ సినీ ప్రస్థానంలోనే అత్యంత దారుణమైన పరాజయంగా మిగిలిపోయింది. అందుకు కారణం కూడా విశాలే అని టాక్ నడుస్తోంది. మొదట ఈ సినిమాకు రవిఅరసు అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించాడు. అయితే అతని పనితీరు నచ్చకపోవడంతో మేకింగ్ మధ్యలోనే విశాల్ స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు. విశాల్ దర్శకత్వం పక్కన పెడితే.. సినిమా అంతకంతకూ ఆలస్యం కావడం, ప్రమోషన్స్ లో హైప్ లేకపోవడం.. అన్నింటికీ మించి కథ మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉండడంతో ప్రేక్షకులు ఇదేం సినిమారా బాబు అని అనుకొనేలా చేశాడు. కనీసం ఆ కొత్త డైరెక్టర్ అయినా ఉండి ఉంటే.. ఈ ప్లాప్ అతని ఖాతాలోనే పడి ఉండేది. ఒకప్పుడు వంద కోట్లు రాబట్టిన హీరో సినిమా ఇప్పుడు తొలిరోజే రూ. కోటి వసూళ్లు సాధించలేకపోయిన చిత్రంగా.. వీకెండ్