విశాఖపట్నంలో రెండు మృతదేహాల కలకలం
Actor ProfilePolitician

విశాఖపట్నంలో రెండు మృతదేహాల కలకలం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విశాఖపట్నంలో రెండు మృతదేహాల కలకలం
Andhra Jyothy9 Jan 2027
విశాఖపట్నంలో రెండు మృతదేహాల కలకలం

విశాఖపట్నంలోని షీలా నగర్‌లో రెండు మృతదేహాలు లభ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. షీలానగర్ జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న షీలానగర్-సబ్బవరం పోర్టు కనెక్టివిటీ రోడ్డు పనుల్లో భాగంగా రెండు గుర్తుతెలియని డెడ్‌బాడీస్ లభించాయి. విశాఖపట్నం, ఆగస్టు 18: నగరంలోని షీలా నగర్‌లో రెండు మృతదేహాలు లభ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. షీలానగర్ జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న షీలానగర్-సబ్బవరం పోర్టు కనెక్టివిటీ రోడ్డు పనుల్లో భాగంగా రెండు గుర్తుతెలియని డెడ్‌బాడీస్ లభించాయి. ఈరోజు(మంగళవారం) డంపర్ లారీలు మట్టి వేస్తుండగా కుప్పలో 2 శవాలు కనిపించాయి. దీంతో సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడకు చేరుకుని ఘటనా స్థలిని పరిశీలించారు. ఒకటి మహిళ మృతదేహం కాగా మరొకటి పురుషుడి మృతదేహంగా గుర్తించారు. రెండు మృతదేహాలూ పూర్తిగా డికంపోజ్ అయినట్లు తెలిపారు. అంతేకాకుండా.. మట్టిలో పాత తలగడలు, బొంతలు, పూలమాలలు, చెక్కలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్డు పనుల్లో భాగంగా ఉపయోగించిన మట్టి.. శ్మశానం నుంచి తీసుకొచ్చినట్లుగా అనుమానిస్తున్నామని ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ చెడిపోయిన ప్రతి మొక్కకు వెయ్యి సాయం.. కొత్త మొక్కలు పెట్టిస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు