
ప్రశ్నించే గొంతులమీద తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లకి తన సమాధానం ఇదేనంటూ సినీనటుడు ప్రకాశ్‌రాజ్ మరో ట్వీట్ చేశారు. వీడియో రూపంలో మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతును ఆపలేరని చెప్పారు. ‘‘మౌనంగా లేను.. అన్నీ చూస్తున్నాను.. అమ్ముడుపోయిన ఛానల్స్ కట్టుకథలు, అబద్ధాలు వింటున్నాను. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. ప్రపంచమంతా మీ దిగజారుడుతనాన్ని చూస్తోంది. దిగజారడంలో మీకు మీరే సాటి అని గర్వంతో దిగజారకండి. మీరు ఎంత అరిచినా ప్రశ్నంచే గొంతును ఆపలేరు’’ అని ప్రకాశ్‌రాజ్ అన్నారు. ప్రకాశ్‌రాజ్ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుగా మారి ఎన్నో అంశాలపై స్పందిస‍్తున్నారు. సమాజంలో జరుగుతున్న అంశాలపై తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేసే వ్యక్తిగా గుర్తింపు పొందారు. దేశ రాజకీయాలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటి అంశాలపై ఆయన తరచూ స్పందిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం, మీడియా, పౌర సమాజం అందరూ జవాబుదారీతనంతో వ్యవహరించాలని ఆయన పలుసార్లు పేర్కొన్నారు. యూత్’ ఫేం మీనాక్షి దినేష్ స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు) శ్రీనివాస మంగాపురం ప్రమోషన్స్.. ఫోటోలు షేర్ చేసిన రాషా తడాని.. ‘లెనిన్’సక్సెస్ మీట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు) కుటుంబ సమేతంగా శివన్న 64వ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు) రైతులు పిచ్చి నా కొడుకుల్లాగా కనిపిస్తున్నారా... తోలు తీస్తాం ఏమనుకున్నారో... తమిళ హీరో ఆర్యపై హైదరాబాద్ లో చీటింగ్ కేసు గల్ఫ్ దేశాల్లో బాంబుల మోత... కువైట్, ఖతార్ లో భారీ పేలుళ్లు చంద్రబాబుకు కోపమొచ్చింది.. పబ్లిక్ మీటింగులో సీరియస్ వార్నింగ్ భూమి ఇవ్వకపోతే ఉరి తీస్తారా... నీ చేతులతోనే ఇవ్వు ఆ 30 రూపాయలు