వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా
Actor ProfilePolitician

వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా
Sakshi7 Dec 2026
వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రయాణంలో జరిగిన రహస్య మార్పు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నాటో సదస్సు తర్వాత అంకారా నుంచి బయలుదేరే సమయంలో ఆయన్ని ఎవరి కంటా పడకుండా మరో విమానంలో తరలించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ఎక్కినట్లు కనిపించేలా ఓ డమ్మీ ఆపరేషన్‌ నిర్వహించి.. అనంతరం ఓ క్యాటరింగ్‌ ట్రక్కు ద్వారా ట్రంప్‌ను మరో సైనిక విమానంలోకి తరలించినట్లు సమాచారం. అయితే ఈ ప్రచారంపై ట్రంప్‌కు తాజాగా ప్రశ్న ఎదురైంది. భద్రతా కారణాలతో ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ నుంచి మరో విమానానికి తనను తరలించారన్న ప్రచారాన్ని ట్రంప్‌ ధృవీకరించారు. ‘‘విమానం మార్చాలన్న నిర్ణయం పూర్తిగా సీక్రెట్‌ సర్వీస్‌, సైనిక అధికారులదే. వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను సీక్రెట్‌ సర్వీస్‌, మిలిటరీ చెప్పినట్లే చేస్తాను. వారు వేరే విమానంలో వెళ్లాలని చెప్పారు. అది కూడా అంతే భద్రత కలిగిన విమానమే. వారు కోరడంతో నేను అలా చేశాను. వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా” అని ట్రంప్‌ అన్నారు. అయితే ఆ ముప్పు ఇరాన్‌ నుంచే ఉందా? అనే విషయంపై ఆయన ధాటవేత ధోరణి ప్రదర్శించారు. తనపై ఉన్న ముప్పు వివరాలను తాను సీక్రెట్‌ సర్వీస్‌ వాళ్లను ఎక్కువగా అడగలేదని ఆయన చెప్పారు. “నాకు చాలా బెదిరింపులు వస్తుంటాయి” అని పేర్కొన్నారు. “మీకు తెలియని చాలా బెదిరింపులు నాకు ఉన్నాయి. ప్రభావవంతమైన అధ్యక్షులకు ఇలాంటి బెదిరింపులు సహజమే. దాదాపు ఆరు సంవత్సరాల కాలంలో నా కంటే ఎక్కువ చేసిన అధ్యక్షుడు ఎవరూ లేరని నేను భావిస్తున్నాను. నిజం చెప్పాలంటే నేను దేని గురించి ఆందోళన చెందను. ఏదైనా సరే.. నా వైఖరి అదే” అని అన్నారు. ఇరాన్‌ను నమ్మను: ట్రంప్‌ ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై కూడా ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నేను ఇరాన్‌ను నమ్మను. వారు నాతో నిరంతరం