విలన్ వేటలో రామ్.. ఫైనల్ గా బాలీవుడ్ హీరో ఫిక్స్
Actor ProfileActor

విలన్ వేటలో రామ్.. ఫైనల్ గా బాలీవుడ్ హీరో ఫిక్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విలన్ వేటలో రామ్.. ఫైనల్ గా బాలీవుడ్ హీరో ఫిక్స్
NTV Telugu15 Jan 2027
విలన్ వేటలో రామ్.. ఫైనల్ గా బాలీవుడ్ హీరో ఫిక్స్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం RAPO23. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ ఇటీవల పాండిచ్చేరిలో భారీ సెటప్‌లో టీమ్ 9 రోజుల పాటు షూటింగ్ చేశారు. వర్షాల కారణంగా షెడ్యూల్‌కు బ్రేక్ పడింది. అయితే ఈ సినిమాలో హీరోకు సమానమైన విలన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ గట్టిగా శ్రమిస్తోంది. సినిమాలోని నెగెటివ్ రోల్ కోసం మేకర్స్ ముందుగా మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ ను సంప్రదించారట. అయితే డేట్స్ కుదరకపోవడంతో ఈ కాంబినేషన్ కుదరలేదు. ఆ తర్వాత కోలీవుడ్ పాపులర్ విలన్ ఎస్‌జే సూర్యను అప్రోచ్ అయ్యారు. అయితే ఆయన ఈ పాత్ర కోసం దాదాపు రూ. 7 నుంచి 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆ రేంజ్ రెమ్యునరేషన్ బడ్జెట్ పరిమితులకు మించడంతో మేకర్స్ ప్రత్యామ్నాయం వైపు చూశారు. చివరకు ఈ పవర్ ఫుల్ యాంటాగొనిస్ట్ రోల్ కోసం బాలీవుడ్ హీరో రితీష్ దేశ్‌ముఖ్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. జెనీలియా భర్త అయిన రితీష్, రామ్ పోతినేనికి మంచి ఆత్మీయుడు, ప్రాణస్నేహితుడు. ఈ క్యారెక్టర్‌కి రితీష్ అయితే కొత్తదనంతో పాటు పాన్-ఇండియా అప్పీల్ వస్తుందని భావించి మేకర్స్ ఆయన వైపు మొగ్గు చూపారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సామ్ సీయస్ సంగీతం అందిస్తున్నాడు