వీర్లగడ్డ తండా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు మంత్రి పొన్నం
Actor ProfilePolitician

వీర్లగడ్డ తండా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు మంత్రి పొన్నం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వీర్లగడ్డ తండా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు మంత్రి పొన్నం
HMTV26 Jan 2027
వీర్లగడ్డ తండా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు మంత్రి పొన్నం

Hanumakonda: వీర్లగడ్డ తండా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు మంత్రి పొన్నం Hanumakonda: భీమదేవరపల్లి మండలం వీర్లగడ్డ తండా గ్రామంలో “పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. ప్రజా పాలన ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామస్థుల సమక్షంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజల నుంచి గ్రామ సమస్యలు, వ్యక్తిగత సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించి, అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. గ్రామంలో 211 రేషన్ కార్డులు పంపిణీ చేయగా, లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. 8 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 6 ఇళ్లు పూర్తయ్యాయి. మరో 2 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. 48 భూభారతి దరఖాస్తులు రాగా, 42 దరఖాస్తులు పరిష్కరించారు. 141 కుటుంబాలకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతోంది. 66 కుటుంబాలకు మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ కింద రూ.37,211 విడుదల చేశారు. 13 స్వయం సహాయక సంఘాల గ్రూపులకు వడ్డీలేని రుణాల కింద రూ.3.75 లక్షలు విడుదల చేశారు. రైతు బీమా కింద ఇద్దరు రైతులకు రూ.10 లక్షలు అందించారు. 239 మంది రైతులకు రైతు రుణమాఫీ కింద రూ.2.26 కోట్లు మాఫీ చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 62 మంది లబ్ధిదారులకు 62 చెక్కులు అందించారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. గ్రామంలో మూతపడిన ప్రభుత్వ పాఠశాలను తిరిగి ప్రారంభించాలని గ్రామస్థులు మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి వచ్చే విద్యా