వారంలోనే.. ఓటీటీలో హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ లెనిన్
Actor ProfileActor

వారంలోనే.. ఓటీటీలో హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ లెనిన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వారంలోనే.. ఓటీటీలో హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ లెనిన్
Chitrajyothy18 Dec 2026
వారంలోనే.. ఓటీటీలో హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ లెనిన్

బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అయ్యగారు అఖిల్ అక్కినేని ‘లెనిన్’ ఇప్పుడు తెలుగు జీ5 లోనూ అద్భుతమైన రికార్డు సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అయ్యగారు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ‘లెనిన్’ (Lenin) ఇప్పుడు తెలుగు జీ5 (Zee5)లోనూ అద్భుతమైన రికార్డు సృష్టించింది. కేవలం ఒక్క వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేయటం విశేషం. థియేట్రిక‌ల్‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ అనంతరం ఓటీటీలోకి వచ్చిన ‘లెనిన్’పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి, ఈ హిస్టరీకి, ఈ ఆదరణకు కారణంగా చెప్పుకోవచ్చు. అఖిల్ కెరీర్‌లో మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత జూలై 10న థియేటర్లలో విడుదలైన ‘లెనిన్’ సినిమా.. ఆయన కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్‌ను సాధించింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రూ.100 కోట్ల వ‌సూళ్ల‌తో మేకర్స్‌కు లాభాలను తెచ్చిపెట్టింది. ప్రేక్షకుల ఆదరణతో ‘లెనిన్’ మంచి కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. అఖిల్ అక్కినేనికి ‘లెనిన్’ ఓ సినిమా మాత్రమే కాదు. సినిమాలకు సుదీర్ఘ విరామం తర్వాత అఖిల్ కెరీర్‌లో కీలక సమయంలో ఈ చిత్రం విడుద‌లైంది. థియేటర్లలో సాధించిన విజయంతో.. అఖిల్ కెరీర్‌లోనే కొత్త కమర్షియల్ హై ను మూవీ అందుకుంది. ఇప్పుడు థియేటర్ల నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ వరకు ‘లెనిన్’ ప్రయాణం కొనసాగుతోంది. తెలుగు జీ5లోనూ ప్రేక్షకులు ఈ సినిమాను ఆసక్తిగా చూస్తుండటంతో, ‘లెనిన్’ విజయవంతమైన జోరు మరింత ముందుకు సాగుతోంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెనిన్’లో యాక్షన్, ప్రేమ, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు పల్లెటూరి నేపథ్యం ప్రధానంగా కనిపిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో పాత్రల మధ్య సంఘర్షణ, వ్యక్తిగత సంబంధాలు, దాగి ఉన్న రహస్యాలు, ఉత్కంఠభరితమైన స‌న్నివేశాల‌ను ఆస‌క్తిక‌రంగా కథను ముందుకు నడిపాయి. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా.. ప్ర‌మోద్ పంజు, రాంకీ, ఈశ్వ‌రీరావు, శివాజీ, బ్ర‌హ్మాజీ, సునీల్ త‌దిత‌రులు ఇత‌ర‌ కీలక పాత్రల్లో కనిపించి సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ