వారం రోజులు కరెంట్ లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా
Actor ProfilePolitician

వారం రోజులు కరెంట్ లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వారం రోజులు కరెంట్ లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా
Asianet News Telugu26 Nov 2026
వారం రోజులు కరెంట్ లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా

ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి పనిలో విద్యుత్ కీలకమైంది. లైట్, ఫ్యాన్, ఛార్జింగ్, ఇంటర్నెట్ ఇలా ప్రతి విషయం కరెంట్‌పై ఆధారపడి ఉంటుంది. అలాంటి విద్యుత్ ఒక వారం రోజుల పాటు లేకపోతే మన జీవితం ఎలా మారిపోతుంది? మొదట చిన్న అసౌకర్యంగా అనిపించినా, రోజులు గడిచే కొద్దీ దాని ప్రభావం ఎలా ఉంటుంది? వంటి ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. వారం రోజులు కరెంట్ లేకపోతే, ఉదయం లేవగానే ఫ్యాన్‌ తిరగదు, మోటర్‌ పనిచేయదు, ఫోన్‌ ఛార్జింగ్ ఉండదు, ఇంటర్నెట్‌ ఉండదు, టీవీ పనిచేయదు. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన పాలు, కూరగాయలు, పండ్లు, ఇతర పదార్థాలు పాడైపోతాయి. అనేక ప్రాంతాల్లో తాగునీటి సరఫరా కూడా నిలిచిపోతుంది. నగరాల్లో అపార్ట్‌మెంట్లలో నివసించే వారికి లిఫ్ట్‌లు పనిచేయవు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు మెట్లు ఎక్కి దిగడమే సవాలుగా మారుతుంది. మొబైల్‌ ఫోన్లకు ఛార్జింగ్‌ లేక కుటుంబ సభ్యులతో, స్నేహితులతో లేదా అత్యవసర సేవలతో సంబంధాలు తెగిపోతాయి. ఇంటర్నెట్‌ లేక ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, డిజిటల్‌ చెల్లింపులు, ఆఫీసు పనులు, ఆన్‌లైన్‌ చదువులు అన్నీ నిలిచిపోతాయి. అంతేకాదు ఆసుపత్రుల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. పెద్ద ఆసుపత్రుల్లో జనరేటర్లు ఉన్నప్పటికీ అవి కూడా పరిమిత సమయం వరకు మాత్రమే పనిచేస్తాయి. ఇంధనం అయిపోతే వెంటిలేటర్లు, ఐసీయూ పరికరాలు, ఆపరేషన్‌ థియేటర్లు, రక్త నిల్వ కేంద్రాల వంటివి ప్రమాదంలో పడతాయి. పరిశ్రమలు మూతపడతాయి. వేలాది మంది కార్మికులకు పని ఉండదు. ఉత్పత్తి నిలిచిపోవడంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. రైళ్లు, విద్యుత్‌తో నడిచే అనేక రవాణా సేవలు నిలిచిపోతాయి. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పనిచేయక రోడ్లపై గందరగోళం ఏర్పడుతుంది. అలాగే రాత్రిపూట స్ట్రీట్ లైట్స్ లేకపోవడం వల్ల ప్రమాదాలు, దొంగతనాలు, ఇతర నేరాలు పెరిగే అవకాశం ఉంటుంది. విద్యుత్‌పై ఆధారపడే వ్యవసాయ రంగం కూడా తీవ్రంగా ప్రభావితమవుతుంది. బోర్లు పనిచేయక పంటలకు