వ రోజూ విజయవంతం.. 64 లక్షల ఇళ్లకు ఇంటింటికీ తెలుగుదేశం
Actor ProfilePolitician

వ రోజూ విజయవంతం.. 64 లక్షల ఇళ్లకు ఇంటింటికీ తెలుగుదేశం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వ రోజూ విజయవంతం.. 64 లక్షల ఇళ్లకు ఇంటింటికీ తెలుగుదేశం-2026
AP7AM5 Jan 2027
వ రోజూ విజయవంతం.. 64 లక్షల ఇళ్లకు ఇంటింటికీ తెలుగుదేశం-2026

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. 22వ రోజుకు చేరుకున్న ఈ కార్యక్రమం ద్వారా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే 64 లక్షలకు పైగా కుటుంబాలను నేరుగా కలిశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన ఈ ప్రచారంలో ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.సోమవారం నాటికి ఈ కార్యక్రమం 22 రోజులు పూర్తి చేసుకుంది. 22వ రోజున రాష్ట్రవ్యాప్తంగా 2.60 లక్షల ఇళ్లను టీడీపీ శ్రేణులు సందర్శించాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం 64.21 లక్షల కుటుంబాలను నేరుగా చేరుకున్నట్లయింది. ఇప్పటికే 60 లక్షల ఇళ్ల సందర్శన మైలురాయిని అధిగమించడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.ఈ ఇంటింటి పర్యటనల్లో భాగంగా, టీడీపీ నాయకులు గత రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ముఖ్యంగా రైతు సంక్షేమం, మహిళలు, యువతకు అందిస్తున్న ప్రయోజనాలు, మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాలు వంటి అంశాలను ప్రతి కుటుంబం దృష్టికి తీసుకెళుతున్నారు.కేవలం ప్రభుత్వ విజయాలను వివరించడమే కాకుండా, ప్రజలతో నేరుగా సంభాదిస్తూ వారి అభిప్రాయాలు, స్థానిక సమస్యలు, అవసరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సమస్యలను సంబంధిత ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ పాలన ఫలాలను ప్రతి గడపకు చేరవేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ముందుకు