
3 బ్యారేజీల పునరుద్ధరణ మీకే ఇస్తా.. కేసీఆర్.. సభకొచ్చి ఒప్పించి బాధ్యత తీసుకో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లు ఆర్థిక ఉగ్రవాదులు రాష్ట్రం ఆర్థిక మూలాలను విధ్వంసం చేశారు మ్యానిప్యులేషన్లో ముగ్గురిదీ ఒకటో ర్యాంకే 3 బ్యారేజీలు నింపితే ఊళ్లే ఎగిరిపోతాయి కేసీఆర్ పాలనలోనే ఎన్‌డీఎస్ఏ ఆ మాట చెప్పింది కేసీఆర్ దుర్మార్గంపై కడుపు రగులుతోంది చుక్కనీరు వాడకుండా 33 వేల కోట్లు కట్టాం 30 నెలలైనా తనకు శిక్ష పడేలా చేయలేకపోయాం కేసీఆర్‌కు వెయ్యెకరాల ఫాంహౌస్.. ఉత్తమ్‌కు ఇల్లేలేదు చేసింది చెప్పడంలోనూ మా నేతలు విఫలమయ్యారు కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు హైదరాబాద్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు త్రయం ఆర్థిక ఉగ్రవాదులని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలు తొమ్మిదిన్నరే ళ్లు వాళ్లకు పాలన అప్పగిస్తే రూ.8.21 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. రూ.38 వేల కోట్లతో పూర్తికావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును రూ.1.21 లక్షల కోట్లకు చేర్చారన్నారు. రూ.1.02 లక్షల కోట్ల చెల్లింపులు చేసిన తర్వాత ప్రారంభించిన మూడేళ్లలోనే ఆ ప్రాజెక్టు కూలేశ్వరంగా మారిందన్నారు. ప్రజలు నమ్మి అధికారాన్నిస్తే ముగ్గురూ కలిసి విధ్వంసం సృష్టించారని, వారిది ఆర్థిక ఉగవ్రాదుల కుటుంబం అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆర్థిక మూలాలను దోపిడీచేసిన ఆ కుటుంబానికి ప్రజాకోర్టులో రెండుసార్లు తీర్పు ఇచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమంలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, వచ్చిన రోజు నుంచే దోపిడీకి పాల్పడ్డారని, ఏ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం పని చేయలేదని ఆరోపించారు. తెలంగాణవాదులు కలలుగన్నది వేరు, కేసీఆర్ ఆలోచన, దృష్టి, చేరుకోవాలనే మజిలీ వేరు అన్నారు. మంగళవారం ప్రజాభవన్‌లో కాళేశ్వరం పునర్నిర్మాణం దిశగా జరుగుతున్న ప్రయత్నాలను ప్రజాప్రతినిధులకు వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. కాళేశ్వరంపై చర్చ పెట్టాలని కోరుతూ కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. తనకు ఎందుకు