వియత్నాం టూర్ కు ఫుల్ డిమాండ్ .. హైదరాబాద్ నుంచే భారీ రద్దీ
Actor ProfileActor

వియత్నాం టూర్ కు ఫుల్ డిమాండ్ .. హైదరాబాద్ నుంచే భారీ రద్దీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వియత్నాం టూర్ కు ఫుల్ డిమాండ్ .. హైదరాబాద్ నుంచే భారీ రద్దీ
Sakshi8 Oct 2026
వియత్నాం టూర్ కు ఫుల్ డిమాండ్ .. హైదరాబాద్ నుంచే భారీ రద్దీ

సాక్షి, హైదరాబాద్‌: నగర పర్యాటకులు హనోయ్‌లో విహరిస్తున్నారు. విదేశీ పర్యాటక ప్రాంతాల ఎంపికలో వియత్నాం పైవరుసలో నిలిచింది. హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి ఏటా వివిధ దేశాలకు రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల్లో వియత్నాం మొదటి స్థానంలో ఉండడం విశేషం. నిరుడు హైదరాబాద్‌ నుంచి 35,776 మంది వియత్నాంలోని హనోయ్, హోచిమిన్‌ నగరాలకు రాకపోకలు సాగించగా, ఈ ఏడాది ఏకంగా 95,016 మంది వెళ్లారు. నగరం నుంచి వియత్నాంకు నేరుగా విమాన సదుపాయాలు అందుబాటులో ఉండడం, సులభంగా వీసా లభించడం వంటి అంశాలు పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. మరోవైపు విమాన చార్జీలు, వసతి, రవాణా సదుపాయాలు అందుబాటు ధరల్లో లభించడంతోనూ నగరవాసులు వియత్నాంను ఎంపిక చేసుకుంటున్నారు. ద్వితీయ స్థానంలో శ్రీలంక.. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి 22 అంతర్జాతీయ నగరాలకు నేరుగా విమాన సరీ్వసులు నడుస్తున్నాయి. ప్రతిరోజూ సుమారు 15వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నారు. సాధారణంగా శ్రీలంక, థాయ్‌లాండ్, మాల్దీవులు, ఇండోనేíÙయా వంటి దేశాలను పర్యాటకులు ఎక్కువగా ఎంపిక చేసుకుంటారు. వీసాలు సులభంగా లభించడంతో పాటు ట్రావెల్స్‌ సంస్థల ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. గత ఏడాది 95,704 మంది శ్రీలంకకు రాకపోకలు సాగించారు. ఈ ఆర్థిక సంవత్సరం పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కేవలం 13 శాతం అధికంగా (1,08,345) మాత్రమే ప్రయాణం చేశారు. వి యత్నాం వెళ్లే వారి సంఖ్య ఏడాదిలో 35 వేల నుంచి 95 వేలకు పెరిగింది. 166 శాతం వృద్ధి రేటు నమోదైనట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. ప్రయాణం.. సులభం.. ప్రస్తుతం హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి వియత్నాంలోని హనోయ్, హోచిమిన్‌ నగరాలకు వియత్నాం ఎయిర్‌లైన్స్, వియట్‌ జెట్‌లకు చెందిన విమానాలు వారానికి 3 సరీ్వసుల చొప్పున నడుస్తున్నాయి. కనెక్టింగ్‌ ఫ్లైట్‌ల కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌ నుంచి కేవలం 4.30 గంటల్లోనే నేరుగా వియత్నాం చేరుకోవచ్చు. గద్వాల్ చీరలో అక్కినేని కోడలు శోభిత (ఫొటోలు) భార్యతో కలిసి హీరో