
ఇంటర్నెట్ డెస్క్: వియత్నాంలో పడవ బోల్తా పడిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో 15 మంది భారత పర్యాటకులు మృతి చెందారు. ఈ ఘటనపై ఈ టూర్‌లో భాగమైన ఏపీకి చెందిన ఒక ప్రత్యక్ష సాక్షి పలు విషయాలు తెలిపారు. బోటు మునిగిన వెంటనే సహాయ చర్యలు అందలేదని, లేదంటే మరింత మంది బతికే వారని తెలిపారు. అపస్మారక స్థితికి చేరుకున్న వారికి వెంటనే ఎలాంటి ప్రాథమిక చికిత్స గానీ, సీపీఆర్ గానీ చేయలేదని పేర్కొన్నారు. అక్కడి సిబ్బంది తక్షణమే స్పందించి ఉంటే ప్రమాద తీవ్రత తగ్గేదన్నారు. తీరానికి చేరుకుంటున్న సమయంలో ఒక పెద్ద అల ఢీకొట్టిందని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు. దీంతో 20 మంది సముద్రంలో పడగా, మిగతావారు అందులోనే చిక్కుకుపోయారని బోటులో ఉన్న నిర్మల్ కుమార్ చెప్పారు. బోటు పూర్తి మూసివేసి ఉందని, దీంతో వెనకాల ఉన్నవారు బయటికి రాలేకపోయినట్లు వెల్లడించారు. తాను, తన స్నేహితుడు బోటుకు ముందు భాగంలో ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డట్లు తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 15 మంది పర్యాటకుల మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు అక్కడి భారత రాయబార కార్యాలయం చర్యలు చేపట్టింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు