
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Vimal Elaichi Ad:మహారాష్ట్ర ఫుడ్ సేఫ్టీ చీఫ్ తుకారాం ముండే ఆగస్టు 11న ఈ నోటీసులు జారీ చేశారు. యాడ్‌కు సంబంధించిన ప్రచారాన్ని వెంటనే ఆపాలని, తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్న సంబంధిత ప్రమోషనల్ కంటెంట్‌ను తొలగించాలని ముగ్గురు హీరోలను ఆదేశించారు. అలాగే ఈ విషయంపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరారు. విమల్ ఎలైచీ పేరుతో ఈ ప్రకటన రూపొందించారు. ఇందులో ఎలైచీ ఉత్పత్తిని ప్రమోట్ చేస్తున్నట్లు కనిపించినప్పటికీ, విమల్ అనే బ్రాండ్ పేరు పాన్ మసాలాతో బలంగా సంబంధం కలిగి ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఎలైచీ పేరుతో పాన్ మసాలా బ్రాండ్‌ను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారా అనే ప్రశ్నలు వచ్చాయి. మహారాష్ట్రలో పాన్ మసాలా తయారీ, నిల్వ, రవాణా, పంపిణీ, అమ్మకాలపై నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో నిషేధించిన ఉత్పత్తికి సంబంధించిన బ్రాండ్ గుర్తింపును మరో ఉత్పత్తి ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం తప్పుదారి పట్టించే ప్రకటనగా మారవచ్చని FDA పేర్కొంది. ఈ ముగ్గురు హీరోల నుంచి వారి ఎండార్స్‌మెంట్ ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా అధికారులు కోరారు. యాడ్‌కు సంబంధించిన ఒప్పందాలు, ప్రచార వివరాలు, చెల్లింపులు, ప్రకటనకు ముందు వారు తీసుకున్న జాగ్రత్తల గురించి సమాచారం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. విమల్ యాడ్ వివాదం ఇదే మొదటిసారి కాదు. 2022లో అక్షయ్ కుమార్ కూడా షారుక్ ఖాన్, అజయ్ దేవగణ్‌తో కలిసి విమల్ ఎలైచీ ప్రకటనలో కనిపించారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో