విమర్శించినా పర్వాలేదు.. బుల్లీయింగ్ ను మాత్రం తట్టుకోలేను
Actor ProfileActor

విమర్శించినా పర్వాలేదు.. బుల్లీయింగ్ ను మాత్రం తట్టుకోలేను

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విమర్శించినా పర్వాలేదు.. బుల్లీయింగ్ ను మాత్రం తట్టుకోలేను
Chitrajyothy27 Dec 2026
విమర్శించినా పర్వాలేదు.. బుల్లీయింగ్ ను మాత్రం తట్టుకోలేను

టీవీ నుంచి వచ్చినవాళ్లు సినిమాల్లో రాణించరనే సూత్రాన్ని తిరగరాసింది ప్రియా భవాని శంకర్‌. అందం కన్నా, టాలెంట్‌తో నిలదొక్కుకుని... తమిళ, తెలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. టీవీ నుంచి వచ్చినవాళ్లు సినిమాల్లో రాణించరనే సూత్రాన్ని తిరగరాసింది ప్రియా భవాని శంకర్‌(Priya Bhavani Shankar) . అందం కన్నా, టాలెంట్‌తో నిలదొక్కుకుని... తమిళ, తెలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా రవితేజ ‘ఇరుముడి’తో (Irumudi) వస్తున్న ఈ బ్యూటీ చెబుతున్న కబుర్లివి.. ఈ రంగంలో గ్లామర్‌ అనేది తప్పు కాదు. అయితే వ్యక్తిగతంగా నా శరీరం ఓ వస్తువు కాదనే స్పృహ నాకుంది. అందుకే గ్లామర్‌ షో అస్సలు చేయను. అందాలు ప్రదర్శించి అవకాశాలు అందుకోవాలనుకోవడం లేదు. అందుకే ఆచితూచి పాత్రల్ని ఎంపిక చేసుకుంటా. రొటీన్‌గా కాకుండా నెగిటివ్‌ రోల్‌ ఇచ్చినా చేయడానికి నేను సిద్ధం. నిజ జీవితంలో నాకు చీకటన్నా, దెయ్యాలన్నా చాలా భయం. చీకట్లో ఒంటరిగా ఉన్నాననే స్పృహే చెమటలు పట్టిస్తుంది. అందుకే ఒక్క అడుగు కూడా వేయకుండా ఎక్కడ కూర్చున్నానో అక్కడే ఉంటా. ఒకవేళ నిజంగానే దెయ్యం కనిపిస్తే అక్కడిక్కడే గుండె ఆగి చచ్చిపోతానేమో. చీకటి అంటే అంత భయం నాకు. గ్లామర్‌ ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి... విమర్శలు వస్తే పర్వాలేదు. సులువుగానే తీసుకుంటా. ఏదైనా అంశం తీసుకొని ట్రోలింగ్‌ చేసినా బాధ లేదు. కానీ బుల్లీయింగ్‌ చేస్తేనే తట్టుకోవడం కష్టం. కెరీర్‌ మొదట్లో నా సినిమాలు సరిగా ఆడలేదు. ఆ సమయంలో బ్యాడ్‌ లక్‌ బ్యూటీ అంటూ కామెంట్‌ చేసేవారు. విపరీతమైన బాధ, కోపం వచ్చేవి. నాకు ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్స్‌ లేరు. స్వశక్తితో పైకి ఎదిగా. కెరీర్‌లో తప్పొప్పులు చాలానే జరిగాయి. అయితే వాటన్నింటి నుంచి నేను చాలా నేర్చుకున్నా. ముందుకు సాగుతున్నా. ఇంజినీరింగ్‌ చదువుతున్నప్పుడే మీడియాలో ఉండాలనుకున్నా. కాలేజ్‌ అయ్యాక గంటన్నర ప్రయాణించి టీవీ స్టూడియోకి చేరుకునేదాన్ని. మొదట న్యూస్‌రీడర్‌గా కెరీర్‌ మొదలుపెట్టా. ఆ తర్వాత