వామికా గబ్బి కెరీర్ లో బిగ్ టర్నింగ్ పాయింట్
Actor ProfileActor

వామికా గబ్బి కెరీర్ లో బిగ్ టర్నింగ్ పాయింట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వామికా గబ్బి కెరీర్ లో బిగ్ టర్నింగ్ పాయింట్
Chitrajyothy26 Nov 2026
వామికా గబ్బి కెరీర్ లో బిగ్ టర్నింగ్ పాయింట్

సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం అనేది సాధారణ విషయం కాదు. కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు, దానితో పాటు అదృష్టం, సరైన సమయం కూడా కలిసి రావాలి. సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం అనేది సాధారణ విషయం కాదు. కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు, దానితో పాటు అదృష్టం, సరైన సమయం కూడా కలిసి రావాలి. ఈ రెండింటిలో ఏది తగ్గినా ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించడం చాలా కష్టం. ముఖ్యంగా కథానాయికల విషయంలో పోటీ తీవ్రంగా ఉంటుంది. కానీ కొందరు మాత్రం విజయం దక్కే వరకు ఓపికగా కష్టపడుతూనే ఉంటారు. ఒకసారి సరైన హిట్‌ పడితే, ఇక వెనుతిరిగి చూసుకోకుండా దూసుకెళ్తుంటారు. ప్రస్తుతం సరిగ్గా ఇదే తరహా క్రేజీ ఫేజ్‌ను అనుభవిస్తోంది అందాల భామ వామికా గబ్బి (Wamiqa Gabbi) బాలీవుడ్ క్లాసిక్ చిత్రం ‘జబ్ వుయ్ మెట్’ ద్వారా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత తెలుగులో ‘భలే మంచి రోజు’ (Bhale Manchi roju) సినిమాతో మన ప్రేక్షకులను అలరించింది. అనంతరం ‘మాలై నేరత్తు మాయకమ్’ చిత్రంతో కోలీవుడ్‌లోనూ మంచి ఎంట్రీ ఇచ్చింది. ఆయా సినిమాల్లో ఆమె నటనకు, పర్‌ఫార్మెన్స్‌కు మంచి మార్కులే పడినా, కొత్త అవకాశాలు మాత్రం అనుకున్న స్థాయిలో తలుపు తట్టలేదు. కెరీర్‌లో ఎన్ని నంబర్స్ సాధించినా, ఎన్ని సినిమాలు చేసినా రావాల్సిన గుర్తింపు రావడానికి మాత్రం చాలా కాలం పట్టింది. అయితే అవకాశాలు తగ్గిన సమయంలో కూడా ఈ భామ అధైర్యపడలేదు. వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా తన టాలెంట్‌ను నిరూపించుకుంటూ ముందుకు సాగింది. సినిమా అవకాశాల్లో కాస్త గ్యాప్ వచ్చినప్పటికీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను వామిక బాగా సద్వినియోగం చేసుకుంది. వరుస వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా తనలోని వైవిధ్యాన్ని నిరూపించుకుంది. అలా ప్రతి అడుగులోనూ నటనను మరింత పదును పెట్టుకుంటూ సరైన సమయం