
టెన్నిస్ క్యాలెండర్‌లో మొత్తం నాలుగు గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. కానీ, ప్లేయర్స్ అందరూ ఏదో ఒక గార్డెన్ పార్టీకి రెడీ అయినట్లు నీట్‌గా తయారై రావాల్సిన టోర్నమెంట్ మాత్రం ఒకే ఒకటి.. అదే వింబుల్డన్. మిగతా టోర్నమెంట్స్ కలర్స్‌ను ఫుల్‌గా యాక్సెప్ట్ చేస్తే.. వింబుల్డన్ మాత్రం స్పోర్ట్స్ హిస్టరీలోనే అత్యంత కఠినమైన డ్రెస్ కోడ్‌లలో ఒకటైన ఆల్ వైట్ రూల్‌ను స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతుంది. అసలు వింబుల్డన్‌లో వైట్ డ్రెస్సే ఎందుకు? ఈ రూల్ ను ఇప్పుడు తీసుకురాలేదు. విక్టోరియన్ కాలం నాటి 19వ శతాబ్దంలో బ్రిటన్‌లోని అప్పర్ క్లాస్ ప్రజలు ఈ లాన్ టెన్నిస్‌ను ఎక్కువగా ఆడేవారు. ఆ రోజుల్లో సమాజంలో తిరిగేటప్పుడు బట్టలపై చెమట మరకలు కనిపించడం అనేది చాలా అవమానకరంగా, అనాగరికంగా భావించేవారు. డార్క్ కలర్ బట్టల కంటే, తెల్లటి బట్టలు వేసుకుంటే చెమట మరకలు అంతగా బయటకు కనిపించవని నమ్మేవారు. అందుకే ఇలాంటి ఆటలు ఆడేటప్పుడు వైట్ క్లోత్స్ వేసుకోవడానికి మొగ్గు చూపారు. 1877లో మొట్టమొదటి వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ జరిగే సమయానికి, ఈ వైట్ డ్రెస్ అనేది టెన్నిస్ ఆటకు ఒక అఫీషియల్ యూనిఫామ్‌గా మారిపోయింది. అయితే, ఇప్పుడున్న మోడ్రన్ రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి. ప్లేయర్స్ బట్టలు దాదాపు పూర్తిగా తెలుపు అయి ఉండాలి. మరి ఆఫ్ వైట్, క్రీమ్ కలర్ లేదా ఐవరీ కలర్స్ వేసుకోవచ్చా? అంటే.. వాటికి అస్సలు ఛాన్సే లేదు. వేరే కలర్ బోర్డర్స్ ఉండకూడదు, బ్రాండ్ లోగోలు కూడా చాలా చిన్నవిగా ఉండాలి. ప్రతీ చిన్న విషయాన్ని కూడా అధికారులు చాలా సీరియస్‌గా చెక్ చేస్తారు. గతంలో టోర్నమెంట్ స్టాండర్డ్స్‌కు మ్యాచ్ అవ్వని షూస్, అండర్ షార్ట్స్, యాక్సెసరీస్ మార్చాలని ప్లేయర్లను ఆదేశించారు. అయితే, మహిళా ప్లేయర్ల కంఫర్ట్‌ను దృష్టిలో ఉంచుకుని, 2023 నుండి వారు డార్క్ కలర్ అండర్ షార్ట్స్ వేసుకోవడానికి వింబుల్డన్ పర్మిషన్ ఇచ్చింది. వింబుల్డన్ వైట్ లుక్