విపక్షాల్ని తుడిచిపెట్టేస్తున్న విజయ్
Actor ProfilePolitician

విపక్షాల్ని తుడిచిపెట్టేస్తున్న విజయ్

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
తమిళనాడులో రిజిస్ట్రేషన్లు ఇకపై ఇలా..! విజయ్ కీలక నిర్ణయం
Oneindia Telugu10 Oct 2026
తమిళనాడులో రిజిస్ట్రేషన్లు ఇకపై ఇలా..! విజయ్ కీలక నిర్ణయం

తమిళనాడు (Tamil Nadu)లో తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ (Vijay).. పాలనలో అప్పుడే తన మార్కు చూపిస్తున్నారు. ముఖ్యంగా పాలనా సంస్కరణల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇదే క్రమంలో తాజాగా మరో

విపక్షాల్ని తుడిచిపెట్టేస్తున్న విజయ్- టీవీకేలోకి భారీగా కీలక నేతల క్యూ
Oneindia Telugu9 Oct 2026
విపక్షాల్ని తుడిచిపెట్టేస్తున్న విజయ్- టీవీకేలోకి భారీగా కీలక నేతల క్యూ

తమిళనాడు రాజకీయ రంగంలో అనూహ్యమైన మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయంతో అధికారాన్ని దక్కించుకున్న నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) వైపునకు ఇతర పార్టీల నేతలు భారీగా క్యూ కడుతున్నారు. ప్రధానంగా అధికార డీఎంకే, విపక్ష ఏఐఏడీఎంకేలకు చెందిన కీలక నాయకులు సరికొత్తగా టీవీకే తీర్థం పుచ్చుకోవడం తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయా రెండు ప్రధాన పార్టీల అధిష్ఠానాలు ఈ పరిణామాలతో తీవ్ర ఆందోళనలో పడ్డాయి.విజయ్ కు సుప్రీం బిగ్ షాక్..! మంత్రులపై రేపు విచారణ..!విజయ్ టీవీకేవైపు విపక్షాల చూపు (vijay) గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 108 స్థానాలను కైవసం చేసుకుని విజయ్ నేతృత్వంలోని టీవీకే సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత మిత్రపక్షాలైన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ వంటి కీలక పార్టీల మద్దతుతో అక్కడ విజయవంతంగా ప్రభువాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఘన విజయంతో విజయ్ పాపులారిటీ రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ వివిధ పార్టీల సీనియర్ నాయకులతో పాటు ద్వితీయ శ్రేణి ప్రతినిధులు కూడా అధికార టీవీకే వైపు చూస్తున్నారు. విజయ్, మంత్రి ఆధవ్ అర్జునకు మద్రాస్ హైకోర్టు షాక్..! ఫలితాలపై విచారణ..!డీఎంకే కీలక నేతల జంప్ డీఎంకే పార్టీకి, ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి జగద్రక్షకన్ కుమారుడు సందీప్ టీవీకేలో చేరడం అధికార వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయనతో పాటు చెన్నై నగర రాజకీయాల్లో కీలక నేతలుగా గుర్తింపు ఉన్న ఆయిరమ్ విలక్కు రవి, మాజీ ఎమ్మెల్యే కలైరాజన్, తిరువళ్లూరు కుమరన్ వంటి ప్రముఖులు కూడా విజయ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ భారీ వలసలు డీఎంకే ప్రధాన కార్యాలయమైన అరివాలయంలో తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. విజయ్ మరో సంచలనం..! భారీగా ఉద్యోగుల జీతాల పెంపు..!