
FMCG price hike | ఇంటర్నెట్ డెస్క్: పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉత్పత్తుల తయారీ వ్యయాన్ని పెంచుతున్నాయి. దీనికి ఎల్‌నినో కూడా తోడైంది. దీంతో కంపెనీ మార్జిన్‌లపై ప్రభావం పడుతుండడంతో దేశంలోని ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు సెప్టెంబర్ త్రైమాసికంలోనూ ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. బ్రిటానియా, హెచ్‌యూఎల్, గోద్రెజ్ వంటి కంపెనీలు.. ఇప్పటికే జూన్ త్రైమాసికంలో కొన్ని ఉత్పత్తుల గ్రామేజ్ బరువు తగ్గించగా, మరికొన్ని ఉత్పత్తుల ధరలను పెంచాయి. అంతర్జాతీయంగా ఇంకా అనిశ్చితి కొనసాగుతుండడంతో ప్రస్తుత త్రైమాసికంలోనూ ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులపై ధరల పెంపు చేపట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఉత్పత్తుల ధరలు 2-5 శాతం మేర పెంపునకు సన్నద్ధమవుతున్నాయి. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు