
తెలంగాణను గత పదేళ్ల విధ్వంస పాలన నుంచి వికాసం వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ.. దెబ్బతిన్న వ్యవస్థల్ని 32 నెలల్లో గాడిన పెట్టాం విద్య, వైద్యం, ఉద్యోగాలు, మౌలిక వసతులపై ప్రత్యేకంగా దృష్టి సారించాం సంక్షేమానికి పెద్ద పీట.. అభివృద్ధికి కొత్త దిశ కృష్ణా, గోదావరి జలాలపై రాజీ ప్రసక్తే లేదు ‘ప్రజావాణి’.. పంద్రాగస్టు వేడుకల్లో సీఎం రేవంత్ హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను గత పదేళ్ల విధ్వంస పాలన నుంచి వికాసం వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ.. తాము అధికారంలోకి వచ్చిన 32 నెలల్లో ఒక్కొక్కటిగా గాడిలో పెట్టామని, సంక్షేమాన్ని విస్తరించి.. అభివృద్థికి కొత్త దిశను నిర్దేశించామని ఆయన పేర్కొన్నారు. పేదల ఆత్మగౌరవం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం, విద్య, వైద్యం, ఉద్యోగాలు, మౌలి క వసతులు, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ రంగాలపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని.. ఈ పునాదులపైనే ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. శనివారం గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొని, జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సంక్షేమాన్ని ఖర్చు చేసిన రూపాయలతో లెక్కించే విధానం తమ ప్రభుత్వానికి లేదని.. పేదల జీవితాల్లో ఆనందం నింపాలన్న తపన, వారికి ఆరోగ్యకరమైన జీవితం, ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని అందించాలన్న సంకల్పంతో పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. 2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని, దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం దాదాపు 91 శాతం అధికంగా ఉందని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలాన్ని చాటుతోందన్నారు. అలాగే.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న నమ్మకంతో వ్యవసాయం, రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. 32 నెలల్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి దాదాపు రూ.1.7
