
ఇప్పటివరకు ఏ టాలీవుడ్ హీరోయిన్ సృష్టించని రికార్డ్ ని స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సృష్టించింది. ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram). నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సమంత భర్త రాజ్ నిడిమోరు నిర్మించాడు. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ హీరోయిన్ సృష్టించని రికార్డ్ ని స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సృష్టించింది. ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram). నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సమంత భర్త రాజ్ నిడిమోరు నిర్మించాడు. ఇక ఎన్నో అంచనాల నడుమ జూన్ 19 న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. విడుదలై 23 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శించబడుతూ రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని అధిగమించింది. టాలీవుడ్ చరిత్రలోనే ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రం ఈ స్థాయి భారీ వసూళ్లను సాధించడం ఇదే ప్రథమం. ఈ అద్భుతమైన ఘనతతో, తెలుగు రాష్ట్రాల నుంచి ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాను తన భుజాలపై వేసుకుని 100 కోట్ల క్లబ్‌లో చేర్చిన తొలి నటిగా సమంత భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇప్పటివరకు ఈ రికార్డ్ ని అనుష్క కూడా అందుకోలేకపోయింది. ఒక సాధారణ గృహిణి తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం తన గతాన్ని ఎదుర్కొని ఎలా పోరాడింది అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో సమంత నటన, ముఖ్యంగా హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నెగటివ్ ట్రెండ్స్, భారీ పోటీని సైతం తట్టుకుని ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను రాబట్టడం విశేషం. ఇక ఈ విషయం తెలియడంతో సమంత ఫ్యాన్స్.. ఇది కదా సమంత రేంజ్ అని కామెంట్స్ చేస్తున్నారు. అక్కినేని నాగ చైతన్యతో