విద్యార్థుల ఆందోళనలకు దొగిచ్చిన జార్ఱండ్ సర్కార్.. జేఎస్ఎస్ సీ
Actor ProfilePolitician

విద్యార్థుల ఆందోళనలకు దొగిచ్చిన జార్ఱండ్ సర్కార్.. జేఎస్ఎస్ సీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విద్యార్థుల ఆందోళనలకు దొగిచ్చిన జార్ఱండ్ సర్కార్.. జేఎస్ఎస్ సీ, టీడీపీఎల్ పరీక్షలన్నీ రద్దు
10TV Telugu6 Jan 2027
విద్యార్థుల ఆందోళనలకు దొగిచ్చిన జార్ఱండ్ సర్కార్.. జేఎస్ఎస్ సీ, టీడీపీఎల్ పరీక్షలన్నీ రద్దు

Jharkhand Govt : జార్ఖండ్‌లో పరీక్షల అవకతవలపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో టీడీపీఎల్‌ సంస్థ 2014 నుంచి నిర్వహించిన అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. అదే సమయంలో జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (JSSC-CGL) పరీక్షలను కూడా రద్దు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం కఠినమైన చట్టం తీసుకొస్తామని హేమంత్‌ సోరెన్‌ తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగార్థుల ఆందోళనల నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు రాష్ట్ర నియామక పరీక్షల వ్యవస్థలో కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. జార్ఖండ్ కేబినెట్ తీసుకున్న ఐదు కీలక నిర్ణయాలు ఇవే.. ♦ టీడీపీఎల్ సంస్థ 2014 నుంచి నిర్వహించిన అన్ని పరీక్షలను, వాటికి సంబంధించిన నియామక ప్రక్రియలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ♦ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC) CGL పరీక్షలను కూడా రద్దు చేయనున్నట్లు సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. ♦ 2014 నుంచి ఇప్పటివరకు నియామక ప్రక్రియల్లో జరిగిన చిన్నదైనా, పెద్దదైనా ప్రతి తప్పిదంపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జార్ఖండ్‌లో 2014 నుంచి నిర్వహించిన అన్ని నియామక పరీక్షలపై సీఐడీ దర్యాప్తు చేయనుంది. ♦ నియామక పరీక్షల వ్యవస్థలో అవసరమైన సంస్కరణలను సూచించేందుకు ఐఏఎస్ అధికారి అమితాభ్ కౌశల్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే మార్గాలను ఈ కమిటీ పరిశీలించనుంది. ♦ విద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని హేమంత్ సోరెన్ తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు త్వరలో బలమైన చట్టాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు