
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వందేమాతరం గీతాలాపనపై రాజకీయ వివాదం చెలరేగింది. వందేమాత్రం పూర్తి గీతాన్ని ఆలపించడాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రయత్నించారని బీజేపీ ఆరోపించింది. ఇంటర్నెట్ డెస్క్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వందేమాతరం గీతాలాపనపై రాజకీయ వివాదం చెలరేగింది. వందేమాత్రం పూర్తి గీతాన్ని ఆలపించడాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రయత్నించారని బీజేపీ ఆరోపించింది. అయితే కాంగ్రెస్ ఆ ఆరోపణను తీవ్రంగా ఖండించింది (Sonia Gandhi Vande Mataram). వందేమాతరం పూర్తి గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పరస్పరం మాట్లాడుకుంటూ, కార్యక్రమ నిర్వాహకులకు ఆపమని సంకేతాలు ఇచ్చారని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది ఆరోపించారు. వందేమాతరం తొలి భాగాలు పూర్తయిన తర్వాత సోనియా గాంధీ అసహనంగా కనిపించారని, గీతాన్ని అక్కడితో ఆపాలని ఆమె సూచించినట్లు తమకు కనిపించిందని బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయ సోషల్ మీడియా ద్వారా విమర్శించారు (BJP Congress row). బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. సోనియా గాంధీ వందేమాతరం గీతాన్ని ఆపాలని ఎలాంటి సూచనా చేయలేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కార్యక్రమంలో చాలాసేపు నిల్చున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కుర్చీ ఏర్పాటు చేయాలని మాత్రమే సోనియా గాంధీ సూచించారని తెలిపింది. వందేమాతరం పూర్తి రూపంలోనే కాంగ్రెస్ కార్యాలయంలో ఆలపించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు (Congress Independence Day event). వందేమాతరంను పూర్తిగా ఆలపించడంపై కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వందేమాతరం గీతాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా అవమానించడాన్ని నేరంగా పరిగణించేలా చట్టపరమైన మార్పులు కూడా జరిగాయి. బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్.. ఉగ్రసంస్థల లింకులతో దర్యాప్తు.. అరుణాచల్‌ప్రదేశ్‌లో వరద బీభత్సం.. నలుగురి మృతి, ఆర్మీ సిబ్బంది గల్లంతు