వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా ఉండటం కంటే అదృష్టం లేదు
Actor ProfileActor

వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా ఉండటం కంటే అదృష్టం లేదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా ఉండటం కంటే అదృష్టం లేదు
AP7AM5 Dec 2026
వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా ఉండటం కంటే అదృష్టం లేదు

వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకునే అవకాశం దక్కడం కంటే అదృష్టం మరొకటి లేదని ప్రముఖ నటుడు నాగార్జున అన్నారు. చిన్నతనంలో తల్లిదండ్రులు తమను ఎలా చూసుకున్నారో.. పెద్దయ్యాక వారిని కూడా అలాగే చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని చెప్పారు.దర్శకుడు ఉదయ్‌ చౌహాన్‌ తెరకెక్కించిన ‘పళ్లబురుసు’ సినిమా ప్రీ-రిలీజ్‌ వేడుకలో నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రుల సంరక్షణపై మాట్లాడారు. చిన్నప్పుడు భయపడితే చేయి పట్టుకుని ధైర్యం చెప్పారని.. జ్వరం వచ్చినప్పుడు దగ్గరుండి చూసుకున్నారని గుర్తుచేశారు. కరెంట్‌ పోయినా భయపడిన సమయంలో అండగా నిలిచారని తెలిపారు. ‘‘వాళ్లు మన కోసం ఉన్నట్టే.. మనం పెద్దయ్యాక వాళ్ల కోసం ఉండకూడదా?’’ అని ప్రశ్నించారు.తన భార్య అమలను ఉదాహరణగా చెబుతూ.. ఆమె 88, 90 ఏళ్ల వయసున్న తల్లిదండ్రులను ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నారని నాగార్జున తెలిపారు. ‘‘తల్లిదండ్రులను చూసుకునే అవకాశం నీకు దక్కడం చాలా అదృష్టం’’ అని ఆమెతో తరచూ చెబుతుంటానన్నారు. తల్లిదండ్రుల సంరక్షణ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.‘పళ్ల బురుసు’ కథను దర్శకుడు ఉదయ్‌ తనకు ఎంతో ఆసక్తికరంగా చెప్పారని నాగార్జున తెలిపారు. సినిమాలో సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్‌ సహా నటీనటులంతా అద్భుతంగా నటించారని ప్రశంసించారు. చిత్రబృందం ఎంతో సమన్వయంతో పనిచేసినట్లు కనిపించిందన్నారు. ప్రేమతో తీసిన సినిమా ఎప్పుడూ విఫలం కాదని చెప్పారు.సినిమాను తాను ఇప్పటికే చూశానని నాగార్జున తెలిపారు. సినిమా చూస్తూ బాగా నవ్వానని.. అదే సమయంలో కళ్లలో నీళ్లు కూడా వచ్చాయని చెప్పారు. మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో పాటు వినోదం కూడా సినిమాలో ఉందన్నారు. చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు