వేదికలు.. 30 మ్యాచులు.. సచిన్ సరసన యశస్వి జైస్వాల్
Actor ProfileActor

వేదికలు.. 30 మ్యాచులు.. సచిన్ సరసన యశస్వి జైస్వాల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వేదికలు.. 30 మ్యాచులు.. సచిన్ సరసన యశస్వి జైస్వాల్
Eenadu28 Dec 2026
వేదికలు.. 30 మ్యాచులు.. సచిన్ సరసన యశస్వి జైస్వాల్

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (Team India Yashasvi Jaiswal) ఓ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ సరసన చేరాడు. శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో యశస్వి 32 పరుగుల వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. యశస్వికిది కెరీర్‌లో 30వ టెస్టు మ్యాచ్. మొత్తం 55 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 2,567 పరుగులు ఉన్నాయి. ఈ క్రమంలో సచిన్‌తోపాటు మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్‌ సాధించిన ఘనతను యశస్వి కూడా నమోదు చేయడం గమనార్హం. కెరీర్‌లో తొలి 30 టెస్టులను భిన్నమైన వేదికల్లో ఆడిన భారత (Team India) ప్లేయర్లు మొన్నటి వరకూ ఇద్దరే ఉండేవారు. ఇప్పుడు మూడో ప్లేయర్ ఆ జాబితాలో చేరాడు. సంజయ్‌ మంజ్రేకర్ వరుసగా 33 టెస్టులను వేర్వేరు వేదికల్లో ఆడాడు. అయితే, అతడి కెరీర్‌లో మొత్తం టెస్టులు 37 మాత్రమే ఉండటం గమనార్హం. ఇక ఆ తర్వాత సచిన్‌ 32 టెస్టులను వేర్వేరు వేదికల్లో ఆడగా.. ఇప్పుడు యశస్వి 30 టెస్టులను పూర్తి చేసుకున్నాడు. సచిన్ (Sachin Tendulkar) తన కెరీర్‌లో మొత్తం 200 టెస్టులు ఆడాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్న సంజయ్‌ ఘనతను అధిగమించే అవకాశం యశస్వికి ఉంది. ఇప్పుడు శ్రీలంకతో రెండో టెస్టుకు కొలంబో వేదిక. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ ఉంది. అప్పుడు యశస్వి (Yashasvi Jaiswal) ఆ రికార్డును బ్రేక్‌ చేసే అవకాశం ఉంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో