విడతల్లో భూముల రీసర్వే పూర్తి.. సాదాబైనామా
Actor ProfilePolitician

విడతల్లో భూముల రీసర్వే పూర్తి.. సాదాబైనామా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విడతల్లో భూముల రీసర్వే పూర్తి.. సాదాబైనామాపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Samayam Telugu30 Oct 2026
విడతల్లో భూముల రీసర్వే పూర్తి.. సాదాబైనామాపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి-2027 నాటికి మూడు విడతల్లో భూముల రీసర్వే ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. దీని పురోగతిపై ప్రతి నెలా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. భూరీసర్వే, భూభారతి చట్టం అమలు, ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై ఖమ్మం కలెక్టరేట్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రైతుల భూములకు నూటికి నూరు శాతం చట్టపరమైన భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పునరుద్ఘాటించారు. ప్రతిష్టాత్మక భూభారతి చట్టం అమల్లోకి వచ్చి 15 నెలలైనా ప్రజల అంచనాలకు అనుగుణంగా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని అంగీకరించారు. ఈ చట్టాన్ని క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలంటే రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూ రీసర్వే అత్యంత అవసరమని మేధావులు, నిపుణులు సూచించడంతోనే ప్రభుత్వం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో నక్షాలు లేని 413 సమస్యాత్మక ప్రాంతాల్లో అధునాతన రోవర్ సాంకేతికతతో రీసర్వే నిర్వహించగా.. దాదాపు 95 శాతం భూ సమస్యలకు తక్షణ పరిష్కారం లభించిందని మంత్రి పొంగులేటి వివరించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పరిధిలోని నక్షాలేని ములుగుమాడు గ్రామంలో ఈ సర్వే విజయవంతంగా పూర్తి కావడంతో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో లబ్ధిదారులకు డిజిటల్ ఈ-పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేసినట్లు గుర్తుచేశారు. ఈ బృహత్తర కార్యం కోసం రెగ్యులర్ సర్వేయర్లతో పాటు శిక్షణ పొందిన లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో పాల్గొనే లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ప్రభుత్వం తరఫున ఎకరాకు రూ.60 చొప్పున సేవా రుసుము చెల్లిస్తామని, ఒకవేళ నిర్దేశిత గడువులోగా సర్వేయర్లు విధుల్లో చేరకుంటే వారికి తుది నోటీసులిచ్చి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.గత ధరణి పోర్టల్