
సుదీర్ఘ కాలం తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగిన నటి జయలలిత, తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, ఆత్మీయుల ద్రోహం, వృత్తిపరమైన సవాళ్లపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగంగా పంచుకున్నారు. దెబ్బ మీద దెబ్బ తగులుతూ, ఒకే చెట్టుకి తగులుతూ ఉంటే చాలా కష్టం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన సంపాదనను పోగొట్టుకుని, చిత్రహింసలు భరించి, కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసినప్పటికీ, రేపు తనకు జ్వరం వస్తే ఒక టాబ్లెట్ తెచ్చేవాళ్ళు కూడా లేరని కన్నీటిపర్యంతమయ్యారు. కోట్ల రూపాయల ఆస్తిని పోగొట్టుకుని, ఒకానొక దశలో కారు కూడా లేకుండా క్యాబ్‌లలో, ఆటోలలో తిరిగిన సందర్భాలు ఉన్నాయని జయలలిత వెల్లడించారు. "నా ఇంట్లో పని చేసే సత్య అనే వంటమ్మాయి, నేను ఆటోలో దిగితే చూసి లోపలికి వెళ్లి ఏడ్చింది" అని ఆమె గుర్తుచేసుకున్నారు. "రుద్రం కోట" అనే సినిమా ప్రమోషన్స్ కోసం పెద్దవాళ్ళ సహాయం కోరినా, ఒక్కరు కూడా స్పందించలేదని, చాలా మంది ఆఫీసులకి వెళ్ళినా, మీటింగ్ లో ఉన్నారని చెప్పి తిరస్కరించారని ఆమె ఆవేదన చెందారు. తన ముఖం చూస్తే ఎవరికీ ఇవ్వబుద్ధి కాదేమో అనుకుంటానని, అయితే తాను ఎవరినీ ఆశించనని, తన చెయ్యి ఎప్పుడూ ఇచ్చే స్థితిలోనే ఉండాలని కోరుకుంటానని ఆమె దృఢంగా చెప్పారు. ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్.. ఆర్థికంగా భారీగా నష్టపోవడానికి గల కారణాలను వివరిస్తూ, అనిల్ గణపతిరాజు అనే వ్యక్తి తన దగ్గర సుమారు నాలుగు కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశాడని జయలలిత పేర్కొన్నారు. విజయనగరంలో అవనం గ్రామానికి చెందిన అనిల్ గణపతిరాజు, గతంలో రాఘవేంద్ర రావు గారి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తూ పరిచయమయ్యాడని, ఆ తర్వాత "కుందనబొమ్మ" అనే సినిమా తీసి నష్టపోయాడని, ఆ నష్టాలను పూడ్చుకోవడానికి తన