
Shreyas Iyer Comments: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడమే కాకుండా, టీ20 చరిత్రలోనే అత్యంత స్వల్ప స్కోర్లలో ఒకటైన 76 పరుగులకే కుప్పకూలింది. ఈ అవమానకర ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో రెండో అత్యల్ప స్కోరు.. బ్యాటింగ్ దరిద్రానికి నిదర్శనం..! ఇంగ్లాండ్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆరంభం నుంచే చేతులెత్తేసింది. వచ్చిన ఆటగాడు వచ్చినట్లే పెవిలియన్‌కు క్యూ కట్టారు. కేవలం 76 పరుగులకే భారత ఇన్నింగ్స్ ముగిసింది. ఇది భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. గతంలో ఆస్ట్రేలియాపై నమోదైన 74 పరుగుల అత్యల్ప స్కోరు రికార్డును తృటిలో తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తరపున వైభవ సూర్యవంశీ చేసిన 13 పరుగులే అత్యధిక స్కోరు కావడం మన బ్యాటింగ్ వైఫల్యానికి, దరిద్రానికి అద్దం పడుతోంది. ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలదొక్కుకుని ఆడలేకపోయాడు. ఇది కూడా చదవండి: టాస్‌లో హీరో.. మ్యాచ్‌లో జీరో.. టీమిండియా పాలిట విలన్‌లా మారిన శ్రేయాస్ అయ్యర్..! ఇంగ్లాండ్ బ్యాటర్ల విధ్వంసం.. భారీ లక్ష్యం.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ 70 పరుగులతో భారత బౌలర్లపై విరుచుకుపడగా, జోష్ బట్లర్ 36 పరుగులు, సామ్ కరన్ 41 పరుగులతో రాణించారు. దీంతో ఇంగ్లాండ్ భారత్‌కు కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ మినహా మిగిలిన వారంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. తలదించుకునేలా ఓడిపోయాం: కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆగ్రహం ఈ దారుణ