విజయ్ కె కామిశెట్టి దర్శకత్వంలో రోషన్ కనకాల.. మూవీ ప్రారంభం
Actor ProfileActor

విజయ్ కె కామిశెట్టి దర్శకత్వంలో రోషన్ కనకాల.. మూవీ ప్రారంభం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విజయ్ కె కామిశెట్టి దర్శకత్వంలో రోషన్ కనకాల.. మూవీ ప్రారంభం
Chitrajyothy22 Oct 2026
విజయ్ కె కామిశెట్టి దర్శకత్వంలో రోషన్ కనకాల.. మూవీ ప్రారంభం

సుమ, రాజీవ్‌ల తనయుడు రోషన్ కనకాల హీరోగా, గహజి హీరోయిన్‌గా రూపుదిద్దుకోనున్న సరికొత్త హై-కాన్సెప్ట్ సై-ఫై ఎంటర్‌టైనర్ చిత్రం అధికారికంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాతో విజయ్ కె కామిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుమ, రాజీవ్‌ల తనయుడు రోషన్ కనకాల (Roshan Kanakala) హీరోగా, గహజి (Gahazy) హీరోయిన్‌గా రూపుదిద్దుకోనున్న సరికొత్త హై-కాన్సెప్ట్ సై-ఫై ఎంటర్‌టైనర్ చిత్రం అధికారికంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. సత్య, సుదర్శన్, రవి తేజ నన్నిమాల ఇతర కీలక పాత్రలు పోషించనున్న ఈ చిత్రంతో ప్రముఖ దర్శకుడు విఐ ఆనంద్ (VI Anand) వద్ద చీఫ్ అసోసియేట్ డైరెక్టర్, డైలాగ్ రైటర్‌గా ఎన్నో ఏళ్లుగా పనిచేసిన విజయ్ కె కామిశెట్టి (Vijay K Kamisetty) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘టైగర్’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’, ‘డిస్కో రాజా’, ‘స్వయంభు’ వంటి విజయవంతమైన చిత్రాలకు విజయ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ఆయన దర్శకత్వంతో పాటు స్క్రీన్‌ప్లే, సంభాషణలు కూడా అందిస్తున్నారు. కాకతీయ హిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ చిత్ర పూజా కార్యక్రమాలలో.. హీరో నిఖిల్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. విఐ ఆనంద్ స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేయడమే కాకుండా, ప్రాజెక్ట్‌కు తన శుభాకాంక్షలు అందిస్తూ ప్రారంభ షాట్‌కు దర్శకత్వం వహించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ సినిమాల స్థాయిని తన వినూత్న స్టోరీ టెల్లింగ్‌తో వినూత్నంగా మార్చేసిన విఐ ఆనంద్ అందించిన కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. గుత్తా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సహకారం అందిస్తోంది. ఆసక్తికరమైన కాన్సెప్ట్, భారీ స్థాయి నిర్మాణంతో ఈ చిత్రం సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఫాంటసీ