వెంకీ మామతో క్లాష్ కు రెడీ అయిన సందీప్.. ఫలితం దక్కేనా
Actor ProfileActor

వెంకీ మామతో క్లాష్ కు రెడీ అయిన సందీప్.. ఫలితం దక్కేనా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వెంకీ మామతో క్లాష్ కు రెడీ అయిన సందీప్.. ఫలితం దక్కేనా
123Telugu12 Jan 2027
వెంకీ మామతో క్లాష్ కు రెడీ అయిన సందీప్.. ఫలితం దక్కేనా

గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న బాక్సాఫీస్ వద్ద రెండు క్రేజీ చిత్రాలు పోటీపడటానికి సిద్ధమయ్యాయి. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ బరిలో నిలవగా, అదే రోజున సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘సిగ్మా’ కూడా థియేటర్లలోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న మొదటి సినిమా కావడం ‘సిగ్మా’పై ఇప్పటికే మంచి అంచనాలను పెంచేసింది. దసరా సెలవుల సమయంతో పాటు గాంధీ జయంతి పండుగ సెలవు కూడా కలిసిరానుండటంతో, ఈ బాక్సాఫీస్ సమరం ఆసక్తికరంగా మారనుంది. కుటుంబ ప్రేక్షకులను, యువతను ఆకట్టుకునేలా రూపొందుతున్న ఈ రెండు చిత్రాలకు ఈ హాలిడే సీజన్ బాగా కలిసివచ్చే అవకాశం ఉంది. ఒకవైపు వెంకటేష్-త్రివిక్రమ్‌ల క్రేజీ కాంబో, మరోవైపు యంగ్ టీమ్ కాంబినేషన్‌లో వస్తున్న సందీప్ కిషన్ ‘సిగ్మా’ అక్టోబర్ 2న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తాయో వేచి చూడాలి