
Eenadu•25 Sept 2026
వైకాపా హయాంలో ఏర్పాటు.. ఇదేనా రూ.400 కోట్ల నాణ్యతవైకాపా ప్రభుత్వ హయాంలో సుమారు రూ.400 కోట్లు వెచ్చించి విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో 81 అడుగుల మండపంపై, 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. 2024 జనవరి 19న అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. సరిగ్గా రెండున్నరేళ్లకే విగ్రహానికి వేసిన రంగులు వెలిసిపోయి తెల్లని మచ్చలతో కనిపిస్తోంది. విగ్రహం పాదంపై నల్లటి మచ్చ దర్శనమిస్తోంది. వైకాపా పాలనలో విగ్రహం ఏర్పాటుకు రూ.వందల కోట్లు వెచ్చించి.. నాణ్యతకు తిలోదకాలిచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైకాపా హయాంలో ఏర్పాటు.. ఇదేనా రూ.400 కోట్ల నాణ్యత?