వైకాపా నాయకులవి దొంగ దీక్షలు
Actor ProfilePolitician

వైకాపా నాయకులవి దొంగ దీక్షలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వైకాపా నాయకులవి దొంగ దీక్షలు
Eenadu20 Nov 2026
వైకాపా నాయకులవి దొంగ దీక్షలు

నెల్లూరు (నగరపాలక సంస్థ): నిరుద్యోగుల పేరిట వైకాపా నేతలు ఆడుతున్న రాజకీయ నాటకాలను, వారి దొంగ దీక్షలను డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ తీవ్రంగా ఎండగట్టారు. ఆదివారం నెల్లూరులోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. మెగా డీఎస్సీ ద్వారా అత్యంత పారదర్శకంగా 16 వేల ఉద్యోగాలు భర్తీ చేసినందుకు ఓర్వలేక వైకాపా తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ఎంపిక విధానంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ఉన్నతాధికారులు స్పష్టత ఇచ్చినప్పటికీ పార్టీ దుష్ప్రచారం కొనసాగిస్తోందని ఆరోపించారు. వీఆర్ కాలేజీ సెంటర్ వద్ద చేపట్టిన నిరసనల్లో డీఎస్సీ అభ్యర్థుల పేరిట జెన్‌జీ విద్యార్థులను కూర్చోబెట్టి దొంగ దీక్షలు చేయించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా పవిత్రమైన వేంకటేశ్వరస్వామి గోవిందనామాలను అపహాస్యం చేస్తూ పాటలు పాడి హిందూ మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం కష్టపడుతుంటే వైకాపా అడ్డుపడుతోందని ఆయన అన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు