
ఒంగోలు నేరవిభాగం: వైకాపా నాయకులు తనపై దాడి చేశారని మనస్తాపంతో అదే పార్టీకి చెందిన మహిళా నాయకురాలు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా ఒంగోలు వైకాపా కార్యాలయంలో ఈనెల 8న వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో నివాళులు సందర్భంగా.. కాళ్లు తొక్కారని ఒంగోలు ఎస్టీసెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న ప్రశ్నించారు. దీంతో ప్రసన్నపై మేరీ కుమారి భర్త శివకుమార్ పార్టీ నాయకుల ముందే దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో పేరం ప్రసన్నని పార్టీకి చెందిన వాట్సప్ గ్రూపుల నుంచి తొలగించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రసన్న ఒంగోలు వైకాపా ఇన్‌ఛార్జి చుండూరి రవిబాబు దీనికి కారకుడని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని.. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా వైకాపా వర్గాల్లో కలకలం రేపింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు