వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు
Actor ProfileActor

వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు
123Telugu6 Dec 2026
వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు

కోలీవుడ్ స్టార్ సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ఈ శుక్రవారం గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్య మాట్లాడుతూ.. ‘లక్కీ భాస్కర్’ తర్వాత వెంకీ అట్లూరి తెచ్చిన ఏ కథకైనా నేను ఓకే చెప్పేవాడినని, ఆయనతో పనిచేయాలని తాను మనస్పూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. అయితే, అంతకంటే ముందే వెంకీ ఒక బయోపిక్ స్క్రిప్ట్‌తో తనను సంప్రదించారని, కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని వెల్లడించారు. సూర్య చేసిన ఈ వ్యాఖ్యలతో వెంకీ అట్లూరి ఏ మహనీయుడి జీవిత కథను సూర్యతో తీయాలనుకున్నారనే ఉత్సుకత అభిమానుల్లో నెలకొంది. తన గత రెండు చిత్రాలు పిరియాడిక్ నేపథ్యంలోనే సాగడంతో, ఈ బయోపిక్ కూడా అదే కోవలోకి వచ్చి రొటీన్‌గా మారుతుందని వెంకీ భావించి దాన్ని పక్కన పెట్టారట. దీనికి తోడు సూర్య కూడా ఒక మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలని ఆశించడంతో వీరి కాంబినేషన్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రూపుదిద్దుకుంది