
Telugu Times•26 Jan 2027
వైఎస్ జగన్ తో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు భేటీమాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) తన కుటుంబ సభ్యులతో మాజీ సీఎం వైఎస్ జగన్ (Y.S. Jagan)ను తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్‌వర్మ (Aarav Varma) ఇటీవల బైక్ నడుపుతూ ఢీకొన్న ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య (Danayya) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో తన కుమారుడిని తప్పించేందుకు ప్రయత్నించారన్న అభియోగాలతో అప్పరాజుపై కేసు నమోదైంది. తర్వాత ఆయన్ను పోలీసులు (police) అరెస్టు చేశారు. ఇటీవల బెయిల్‌పై బయటకొచ్చిన ఆయన తన కుటుంబ సభ్యులతో వచ్చి జగన్‌ను కలిశారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్‌వర్మ కూడా వారితో పాటు ఉన్నారు