లవ్లీనా చేసింది సామాన్యమైన విషయం కాదు
Actor ProfilePolitician

లవ్లీనా చేసింది సామాన్యమైన విషయం కాదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లవ్లీనా చేసింది సామాన్యమైన విషయం కాదు
Eenadu25 Nov 2026
లవ్లీనా చేసింది సామాన్యమైన విషయం కాదు

ఇంటర్నెట్ డెస్క్‌: భారత బాక్సర్ లవ్లీనాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రశంసల వర్షం కురిపించారు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లు ఆదివారం ప్రధానిని కలిసిన సంగతి తెలిసిందే. వారితో సరదాగా మాట్లాడిన మోదీ అథ్లెట్లకు లడ్డూలు తినిపించారు. ఈ సందర్భంగా బాక్సర్ లవ్లీనా.. గ్లాస్గోలో చేసిన పనిని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. అదేమీ చిన్న విషయం కాదని.. దేశమంతా సుదీర్ఘకాలం గుర్తు పెట్టుకుంటుందని తెలిపారు. ప్రధాని: అసలేం జరిగింది? మీరు ఆ రెస్టరెంట్‌తో ఎందుకు పోరాడారు? లవ్లీనా: కామన్వెల్త్ గేమ్స్‌లో మంచి ప్రదర్శన చేశాం. అది చివరి రోజు. చాలా సంతోషంగా గడపాల్సిన సందర్భం. అందుకోసం ఓ రెస్టరంట్‌కు వెళ్లాం. అయితే, మన మ్యాప్‌ సరిగా లేదని అనిపించింది. ఇదే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లా. మార్పులు చేస్తామని చెప్పారు. ప్రధాని: సంబరాలు చేసుకుంటున్న సమయంలో మీరు మ్యాప్‌ ప్రాముఖ్యతను గుర్తించడం నిజంగా అభినందనీయం. ఆ వీడియో సాధారణమైంది కాదు. దేశ ప్రజలు సుదీర్ఘకాలం గుర్తుంచుకుంటారు. గ్లాస్గోలోని ఓ రెస్టరెంట్‌కు లవ్లీనా (Lovlina Borgohain)తోపాటు కొందరు భారత అథ్లెట్లు డిన్నర్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న హ్యాండ్‌ టవల్స్‌ (నాప్‌కిన్‌లు)పై భారత్‌ మ్యాప్‌ అసంపూర్తిగా ఉండటం లవ్లీనా గమనించింది. ఈశాన్య రాష్ట్రాలతోపాటు కశ్మీర్‌ పూర్తి భూభాగాలను ఆ చిత్రపటంలో చూపించకపోవడంతో సోషల్ మీడియా వేదికగా లవ్లీనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ తర్వాత రెస్టరంట్ క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటనను జారీ చేసింది. అయితే, ఇది కావాలనే చేసిందని.. పొరపాటు కాదని అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మరో బాక్సర్ నరేంద్ర బేర్వాల్ గతంలో తనకు పాక్‌ బాక్సర్‌తో ఎదురైన అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. ‘‘పాకిస్థాన్‌ గురించి ఏ మాట్లాడినా నాకొక స్టోరీ గుర్తుకొస్తుంది సర్. అది 2015 మిలిటరీ గేమ్స్. నా ఫస్ట్ ఫైట్‌ పాకిస్థాన్‌ బాక్సర్‌తోనే. అప్పుడు ఉన్నతాధికారులు, సహచరులు ఒకటే చెప్పేవారు