లను ఆన్
Actor ProfilePolitician

లను ఆన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లను ఆన్-ఆఫ్ చేస్తున్న యాప్..? వైరల్ వీడియో వెనుక అసలు స్టోరీ ఇదే
10TV Telugu6 Oct 2026
లను ఆన్-ఆఫ్ చేస్తున్న యాప్..? వైరల్ వీడియో వెనుక అసలు స్టోరీ ఇదే

BAT BMS App : అయ్య బాబోయ్.. బ్యాట్ బీఎంఎస్ యాప్ మళ్లీ వచ్చిందా? ప్రభుత్వం బ్లాక్ చేసిందిగా.. అయినా ఈ-రిక్షాలను ఆపే యాప్ పోయిందిలే అనుకుంటే.. ఈసారి ఏటీఎంలను ఆన్ ఆఫ్ చేసే మరో యాప్ టెన్షన్ పుట్టిస్తోంది. ఇటీవల దేశవ్యాప్తంగా ఈ-రిక్షాలను రిమోట్‌గా ఆపేస్తున్న వీడియోలు వైరల్ అవ్వడంతో పెద్దఎత్తున చర్చకు దారితీశాయి. దీనికి BAT BMS అనే చైనీస్ యాప్ పేరు ఎక్కువగా వినిపించింది. అసలు లిథియం బ్యాటరీలను మానిటరింగ్ చేసేందుకు రూపొందించిన ఈ యాప్‌ను కొందరు దుర్వినియోగం చేసి ఈ-రిక్షాల బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS)తో కనెక్ట్ అయి వాహనాలను నిలిపివేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం బ్యాట్ బీఎంఎస్ యాప్‌ను బ్లాక్ చేసింది. అలాగే గూగుల్ ప్లో స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి తొలగించాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేసింది. Read Also : E20 ethanol Myths : E20 పెట్రోల్ అద్భుతం.. ఆహా.. ఓహో అంటున్న ప్రభుత్వం.. అవన్నీ నమ్మొద్దని విజ్ఞప్తి! ఇక సమస్య లేనట్టే అనుకుంటే.. ఇప్పుడు మరో యాప్ బెంబేలిత్తిస్తోంది. ఈ కొత్త యాప్ వీడియో సోషల్ మీడియాలో తెగ్ వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి మొబైల్ యాప్ ద్వారా ఏటీఎంలను రిమోట్‌గా ఆన్, ఆఫ్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ముఖ్యంగా, ఆ యాప్ యూజర్ ఇంటర్‌ఫేస్ బ్యాట్ బీఎంఎస్ మాదిరిగా ఉండటంతో మళ్లీ యాప్ ఎంట్రీ వచ్చిందా ఏంటి అనే కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏటీఎం కంట్రోలింగ్‌పై నో క్లారిటీ : వాస్తవానికి, కీలక విషయం తప్పక గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు ఈ వైరల్ వీడియో రియల్‌గా ఏటీఎంలను హ్యాక్ చేసి కంట్రోల్ చేస్తుందనడానికి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. అలాగే వీడియోలో కనిపిస్తున్న యాప్ బ్యాట్ బీఎంఎస్ యాప్ లేదా అదే తరహా ఇంటర్‌ఫేస్‌తో రూపొందించిన మరో అప్లికేషన్‌నా అన్నది కూడా క్లారిటీ లేదు